‘రేయ్‌.. నాకొడకా.. తేల్చుకుందాం..రా’ | TDP Leader Mallikarjuna Controversial Comments In Anantapur | Sakshi
Sakshi News home page

‘రేయ్‌.. నాకొడకా.. తేల్చుకుందాం..రా’

Nov 3 2026 7:46 AM | Updated on Nov 3 2026 7:48 AM

TDP Leader Mallikarjuna Controversial Comments In Anantapur

మీసం తిప్పుతూ మాట్లాడుతున్న టీడీపీ నాయకుడు మల్లికార్జునరెడ్డి

అనంతపురం : ‘రేయ్‌.. నాకొడకా.. తేల్చుకుందాం..రా ’ అంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మదిగుబ్బ వీరాంజనేయులుపై టీడీపీ నేత మల్లికార్జునరెడ్డి బెదిరింపు ధోరణిలో బూతు పురాణం చర్చనీయాంశమైంది.  

ఏం జరిగిందంటే.... ఆత్మకూరు మండలంలో గత నెల 22న ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. అడుగడుగునా అధికార పార్టీ నేతలు అరాచకాలు సృష్టించారు. అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుతగిలారు. దీంతో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తన పార్టీ కార్యకర్తలు, ఎంపీటీసీ అభ్యర్థులతో కలసి నామినేషన్లు వేయడానికి గత నెల 2న వెళ్తుండగా వడ్డుపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభ్యర్థులు రాస్తారోకో చేశారు.  ఇదే సమయంలో మదిగుబ్బకు చెందిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మదిగుబ్బ వీరాంజనేయులు ‘ఇదేమి రాజ్యం.. దోపిడీ రాజ్యం’ అంటూ అధికార పార్టీ నేతల ఆగడాలను నిరసిస్తూ నినాదాలు చేశాడు. 

దీంతో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్న మదిగుబ్బకు చెందిన టీడీపీ నాయకుడు మల్లికార్జున రెడ్డి ఈ నెల 1న మదిగుబ్బ గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రెచ్చిపోయాడు. ‘ రేయ్‌ నాకొడకా..తేల్చుకుందాం.. రేయ్‌.. వీరాంజనేయులు.. ఈ ఊర్లో నువ్వైనా ఉండాలి.. నేనైనా ఉండాలి.. రా’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు.  అంతటితో ఆగకుండా ఇప్పటి నుంచి గూండాగిరీ చేస్తా.. ఎవరిని పిలుచుకుంటావో పిలుచుకో.. అంటూ రెచ్చిపోయాడు. మొన్న ఆత్మకూరులో నామినేషన్లు వేయడానికి వచ్చి ఎందుకు రాలేదు.. మీరు వచ్చింటే వెనక్కు వెళ్లనిచ్చేవాడిని కాదు.. అంటూ వీరాంజనేయులుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నెల 5న ఓటింగ్‌ ఉంది కదా.. ఓటు వేయడానికి ఎవడొస్తాడో రండి.. నేనేంటో చూపిస్తా.. మీకు బడిత పూజ చేస్తా..అంటూ బెదిరింపు ధోరణితో ఊగిపోయాడు.   

ఇక ఎంపీపీ పదవి దక్కితే ఏం చేస్తారో..? 
ఆత్మకూరు మండలంలో ప్రస్తుతం 11 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ నేతలు నామినేషన్ల పరిశీలనలో 4 స్థానాలు ఏకగ్రీవం చేసుకున్నారు. మదిగుబ్బ మల్లికార్జునరెడ్డిని టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే నాలుగు స్థానాలు వచ్చాయి. ఇక రెండు స్థానాలు వస్తే ఎంపీపీ పదవి వస్తే ఇంకేం చేస్తారో అంటూ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.   

ఇదీ చదవండి: అమ్మా భయమేస్తోంది.. నన్ను తీసుకెళ్లండి!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement