మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అప్‌డేట్స్...
కోనసీమ జిల్లా..
- అమలాపురంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కి సైతం తప్పని కరెంట్ కష్టాలు
- ఏడో రోజులు గడుస్తున్న అమలాపురంలో పూర్తిగా సరఫరా కాని విద్యుత్
- కౌంటింగ్ సెంటర్‌కు జనరేటర్‌తో విద్యుత్ సరఫరా
- జనరేటర్ మోరాయిస్తుండటంతో ఇబ్బంది పడుతున్న సిబ్బంది

కర్నూలు జిల్లా..
- ఆదోని ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్యోగుల ఆందోళన.
- అల్పాహారం ఆలస్యం కావడంతో వేచి ఉన్న కౌంటింగ్ సిబ్బంది.
- కౌంటింగ్ ప్రారంభానికి సమయం అవుతున్నా అందని టిఫిన్.
- టిఫిన్ అందక నిలిచిపోయిన కౌంటింగ్ ప్రక్రియ.
విశాఖ..
- జీవీఎంసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
- ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు..
- బాక్స్‌లు ఓపెన్ చేసి లెక్కింపు ప్రారంభించిన కౌంటింగ్ సిబ్బంది..
- మొదటగా ఈస్ట్ జోన్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం
విజయవాడ..
- బెజవాడ కార్పోరేషన్ ఎన్నికల కౌంటింగ్‌పై మురసు తుఫాన్ ప్రభావం
- బెజవాడలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
- కౌంటింగ్ కేంద్రాలకు పూర్తి స్థాయిలో ఇంకా చేరుకోని సిబ్బంది
- కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం.
- 8 గంటలకు ప్రారంభం కావలసిన కౌంటింగ్ గంట ఆలస్యం అవుతుందని చెబుతున్న అధికారులు
- అధికారుల కోఆర్డినేషన్ లోపంతో ఇబ్బందులు పడుతున్న కౌంటింగ్ సిబ్బంది..
👉మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 13 నగర కార్పొరేషన్లలో మేయర్, 804 డివిజన్లలో కార్పొరేటర్ల పదవులతో పాటు 79 మున్సిపాలిటీల్లో 2,382 వార్డు కౌన్సిలర్లు, 70 చైర్మన్ పదవులకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరగనుంది.
- మరోవైపు.. తుపాన్ ప్రభావంతో కౌంటింగ్ వాయిదా..
- ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ వాయిదా.
- అద్దంకి, చీమకుర్తి మున్సిపాలిటీల్లోనూ కౌంటింగ్ వాయిదా వేసిన కలెక్టర్.
- తుపాన్ ప్రభావం తగ్గిన తర్వాతే కౌంటింగ్ జరుగుతుందన్న కలెక్టర్.
- చీరాల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 11 గంటలకు మార్చిన అధికారులు.
👉మంగళవారం రాత్రి 8 గంటలలోపే అన్ని చోట్లా లెక్కింపు పూర్తి అయ్యేలా అధికారులు ఏర్పాట్లు. మొత్తం 138 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం. గ్రేటర్ విశాఖపట్నంలో మాత్రమే ఒక్క కార్పొరేషన్‌కు సంబంధించి పది లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
👉మిగిలిన 12 నగర కార్పొరేషన్లలో ఒక్కో లెక్కింపు కేంద్రం వంతున ఏర్పాటు చేశారు. ఈ మొత్తం 22 లెక్కింపు కేంద్రాల్లో 4,026 టేబుళ్లు ఏర్పాటు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలియజేసింది. 79 మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన 116 లెక్కింపు కేంద్రాల్లో 2,805 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియలో మొత్తం 47,817 మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటారని కమిషన్ వివరించింది. ఆయా కేంద్రాల వద్ద ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు 1372 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.
రీపోలింగ్‌లో 60.64 శాతం ఓట్లు నమోదు
👉రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలోని 13 పోలింగ్ బూత్‌లలో సోమవారం నిర్వహించిన రీపోలింగ్‌లో సాయంత్రం 5 గంటల సమయానికి 60.64 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 9,890 మంది ఓటర్లకు గాను 6,041 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: మాజీ సీఎం వైఎస్ జగన్ సహా 70 మందిపై అక్రమ కేసు


