మురసు తుపాన్ బీభత్సం అప్‌డేట్స్...
ఏపీ తీర ప్రాంతాన్ని వణికించిన తీవ్ర తుపాను మురసు తీరం దాటింది. నెల్లూరు-నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య తీవ్ర తుపానుగా తీరం దాటినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి.
ప్రకాశం
- మురసు తుఫాను భీభత్సం
- కొండేపి టంగుటూరు రోడ్దుపై విరిగిపడ్డ భారీ వృక్షాలు రాకపోకలకు అంతరాయం
- సింగరాయకొండ రైల్వే స్టేషన్‌లో కొల్లాం-వైజాగ్ ఎక్స్‌ప్రెస్ నిలిపివేత
- ఇబ్బందుల్లో ప్రయాణికులు
- నిడమానూరు ఉప్పలపాడు రోడ్దుకి అడ్దంగా పడిన వృక్షాలు
- ఒంగోలు నిడమానూరు మధ్య నిలిచిన రాకపోకలు
విశాఖ..
- పూర్తిగా తీరం దాటిన మురసు తుపాను..
- ఒంగోలు సమీపంలో తీరం దాటినట్టు వాతావరణ శాఖ ప్రకటన..
- పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలహీన పడనున్న తుఫాను..
- మరో 24 గంటలపాటు ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్న అధికారులు..
ఏలూరు జిల్లా
- తుపాను కారణంగా ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు.
- వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, అంగన్‌వాడీలకు నేడు సెలవు ప్రకటించిన కలెక్టర్
👉ఇక, తుపాను కదలికలను ఆర్టీజీఎస్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నిరంతరం పర్యవేక్షించాయి. తుపాను తీరం దాటినప్పటికీ ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని అధికారులు హెచ్చరించారు. మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వెల్లడించారు.
#WATCH | Ongole, Andhra Pradesh: The landfall process of Cyclone Murasu has started along the South Andhra Pradesh coast. Heavy rainfall accompanied by extremely strong gale winds is lashing the Kothapatnam Beach area near Ongole, with strong winds witnessed along the coastline as the cyclone makes landfall.
— ANI (@ANI) November 3, 2026
👉ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనా, ఏ సమయంలోనైనా 9552300009 నంబర్‌కు లేదా మన మిత్ర ద్వారా సమాచారం అందించాలని కోరారు.
నిన్న ఉదయం 8.30 నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు ప్రకాశం (జి) నాగులుప్పలపాడులో 198.01 మిమీ, కొత్తపట్నంలో 182.25 మిమీ , బాపట్లలో 128.53 మిమీ, చీరాలలో 124.10 మిమీ , ప్రకాశం(జి) త్రోవగుంటలో 116.93 మిమీ, ఒంగోలు అర్బన్ 106.97 మిమీ , https://t.co/N0qaWH6rTx
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) November 3, 2026
- మురసు తుపాన్ కారణంగా నిన్న ఉదయం 8.30 నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు ఇవే..
- ప్రకాశం (జి) నాగులుప్పలపాడులో 198.01 మిమీ, కొత్తపట్నంలో 182.25 మిమీ ,
- బాపట్లలో 128.53 మిమీ, చీరాలలో 124.10 మిమీ ,
- ప్రకాశం(జి) త్రోవగుంటలో 116.93 మిమీ, ఒంగోలు అర్బన్ 106.97 మిమీ ,
- చిలకపాడులో 104.50 మిమీ, సంతనూతలపాడు 98.7మిమీ,
- పశ్చిమగోదావరి (జి) మొగల్తూరులో 96మిమీ,
- కోనసీమ(జి) మలికిపురం 93.7మిమీ వర్షపాతం నమోదు.
ఇదీ చదవండి: మా ఓటు మేమే వేసుకునే హక్కు లేదా?


