పులివెందుల ఓటర్ల ఆవేదన
పోలింగ్ కేంద్రాలకు వెళ్లినా ఓటు వేయనీయలేదు
ఓటరు స్లిప్పులు లాక్కొని, బెదిరించి వెనక్కి పంపించారు
ఓటు వేసేందుకు వెళ్తే పోలింగ్ కేంద్రాల వద్దే అడ్డంకులు
‘‘మీ ఓటు మేమే వేసేశాం.. వెళ్లిపోండి’’ అంటూ బెదిరింపులు
ఓటరు స్లిప్పులు లాక్కొని, చించివేసిన టీడీపీ అల్లరి మూకలు
సైకిల్ గుర్తుకే ఓటు వేయాలంటూ ఒత్తిడి చేశారు
మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా అసభ్య వ్యాఖ్యలు, దౌర్జన్యాలు
పోలింగ్ కేంద్రాల్లోకి ఏజెంట్లను అనుమతించకుండా తరిమివేత
ఏజెంట్లపై దాడులు.. ఓటర్లపై దౌర్జన్యం
ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారన్న ఓటర్లు
ఓటు హక్కు వినియోగించుకునేలా రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్
‘‘మా ఓటు మేము వేసుకోవాలనుకున్నాం.. కానీ మమ్మల్ని పోలింగ్ కేంద్రాలకే రానీయలేదు. ఓటు వేసేందుకు వెళ్తే టీడీపీ గూండాలు, రౌడీలు అడ్డుకున్నారు. ఓటరు స్లిప్పులు లాక్కొని చించేశారు.. ‘మీ ఓటు మేమే వేసేశాం.. వెళ్లిపోండి’ అంటూ బెదిరించారు.’’ ఇదీ పులివెందుల మహిళా ఓటర్ల ఆవేదన. మహిళలమని, వృద్ధులమని కూడా చూడకుండా అసభ్యంగా మాట్లాడారని, ఏజెంట్లను సైతం పోలింగ్ కేంద్రాల నుంచి తరిమేశారని వారు వివరించారు.
ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని, 30 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి ఎన్నికలను చూడలేదని మహిళలు పేర్కొన్నారు. ‘‘ఓటు హక్కు ఉన్నా ఓటు వేసుకోలేని దుస్థితి మాది. మాకు కావాల్సింది ఒక్కటే.. మా ఓటు మేమే వేసుకునే అవకాశం కల్పించాలి. ప్రశాంత వాతావరణంలో రీపోలింగ్ నిర్వహించాలి!’’ అని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. – పులివెందుల రూరల్/ సాక్షి, నెట్‌వర్క్

ఓటు వేయనీయకుండా అడ్డుకున్నారు!
ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లా. అక్కడ టీడీపీ గూండాలు, అల్లరి మూకలు నా ఓటర్ స్లిప్పు లాక్కొని నన్ను ఓటు వేయనీయకుండా అడ్డుకున్నారు. నా జీవితంలో ఇలాంటి ఎన్నికలను ఎప్పుడూ చూడలేదు. గెలుపు కోసం చంద్రబాబు ప్రభుత్వం ఇంతటి దౌర్జన్యాలకు పాల్పడటం సిగ్గుచేటు! – గంగాదేవి, మహిళా ఓటరు, పులివెందుల
పోలీసులే అడ్డుకున్నారు!
ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళితే పోలీసులే నన్ను అడ్డుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి రౌడీలు, గూండాలను తీసుకొచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. ఓటు వేసేందుకు వెళ్లే ప్రజలను అడ్డుకోవడం, పోలీసులే ఓటు హక్కుకు అవరోధంగా నిలవడం ఏమిటి? ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను రౌడీలు, గూండాల మధ్య నిర్వహించడం చంద్రబాబు ప్రభుత్వానికి తగదు. – రాణి, మహిళా ఓటరు, పులివెందుల
మహిళలని కూడా చూడకుండా చేయిపట్టి లాగేశారు!
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన మహిళలపై టీడీపీ గూండాలు, రౌడీలు దౌర్జన్యానికి దిగారు. మహిళలని కూడా చూడకుండా చేయిపట్టి లాగేశారు. ‘మీ ఓటు మేమే వేసేశాం.. వెళ్లిపోండి’ అంటూ హుకుం జారీ చేశారు. ఎదురు తిరిగితే కొట్టాల్సి వస్తుందని బెదిరిస్తూ పోలింగ్ కేంద్రాల నుంచి తరిమేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని మహిళల ఓటు హక్కును సైతం కాలరాయడం చంద్రబాబు ప్రభుత్వానికి సిగ్గుచేటు! – రాధ, మహిళా ఓటరు, పులివెందుల
ఇంత దారుణమా?
మున్సిపల్ ఎన్నికలు ఐదేళ్లకోసారి జరిగే ప్రజాస్వామ్య ప్రక్రియ. అలాంటి ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాలి. కానీ ఈ ఎన్నికల్లో అల్లర్లు సృష్టించి, ఓటర్లను ఓటు వేయనీయకుండా అడ్డుకుని, టీడీపీ గూండాలు ఇష్టానుసారంగా ఓట్లు వేసుకున్నారు. ఇంత దారుణమా? – మునెమ్మ, మహిళా ఓటరు, పులివెందుల
ఎన్నడూ ఇలాంటి ఎన్నికలను చూడలేదు!
గత 30 ఏళ్లుగా సాధారణ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా ఎప్పుడూ ఇలాంటి అల్లర్లు, గొడవలు చూడలేదు. ఆదివారం పులివెందులలో జరిగిన ఎన్నికల తీరు చూసి ఓటర్లంతా భయాందోళనకు గురయ్యారు. ఓటమి భయంతో కూటమి ప్రభుత్వం రిగ్గింగ్‌కు పాల్పడి, ఓటర్లను ఓటు వేయనీయకుండా అడ్డుకున్న పరిస్థితులు కనిపించాయి. నా జీవితంలో ఇలాంటి ఎన్నికలను ఎప్పుడూ చూడలేదు! – సంధ్య, మహిళా ఓటరు, పులివెందుల
మాకు ఓటు వేసే హక్కు లేదా?
ప్రజాస్వామ్యంలో ఓటు వేసే హక్కు ప్రతి ఓటరుకూ ఉంది. కానీ ఆదివారం పులివెందులలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ఓటు వేయనీయకుండా అడ్డుకోవడం సిగ్గుచేటు. ఓటమి భయంతో చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలను ఈ విధంగా నిర్వహించడం సరైన పద్ధతి కాదు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే! – ఆదాంబి, మహిళా ఓటరు, పులివెందుల
నా ఓటు రిగ్గింగ్ చేసుకోవడం ఏమిటి?
నా ఓటు నాకు వజ్రాయుధం లాంటిది. అలాంటి విలువైన ఓటును టీడీపీ గూండాలు రిగ్గింగ్ ద్వారా వేసుకోవడం ఏమిటి? ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదు. రౌడీలు, గూండాల ఆధ్వర్యంలో జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం మునుపెన్నడూ చూడలేదు. – యాస్మిన్, మహిళా ఓటరు, పులివెందుల
మా ఓటరు స్లిప్పులు లాక్కొన్నారు
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లినప్పుడు టీడీపీ గూండాలు, రౌడీలు నన్ను ఓటు వేయనీయకుండా అడ్డుకున్నారు. మా చేతుల్లో ఉన్న ఓటరు స్లిప్పులను లాక్కొని, ‘‘మీ ఓటు మేమే వేస్తాంలే.. వెళ్లిపోండి’’ అంటూ బెదిరించారు. ఓటు హక్కును కాలరాస్తూ ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడిన ఎన్నికలను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు! – రాజేశ్వరి, మహిళా ఓటరు, పులివెందుల
గంటల తరబడి వేచి ఉన్నా ఓటు వేసే అవకాశం ఇవ్వలేదు!
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి ఉన్నాం. అయినా మమ్మల్ని పోలింగ్ కేంద్రాల లోపలికి అనుమతించలేదు. పోలీసులు, టీడీపీ నాయకులు కుమ్మక్కై మమ్మల్ని ఓటు వేయకుండా అడ్డుకున్నారు. ఆరు గంటల పాటు వేచి ఉన్నా మా ఓటు హక్కును వినియోగించుకోలేకపోయాం! – కామాక్షి, మహిళా ఓటరు, పులివెందుల
పోలింగ్ కేంద్రంలో ఏజెంట్‌గా కూడా ఉండనీయలేదు!
మున్సిపల్ ఎన్నికల్లో ఎర్రగుడిపల్లె పోలింగ్ కేంద్రంలో ఏజెంట్‌గా విధులు నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లిన నన్ను టీడీపీ గూండాలు, రౌడీలు బలవంతంగా బయటకు పంపించారు. ఏజెంట్లకే పోలింగ్ కేంద్రాల్లో చోటు లేకుండా చేస్తూ, దౌర్జన్యాలు, దాడులతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. ఎన్నికల ప్రక్రియలో ఏజెంట్లను కూడా అడ్డుకోవడం ఏమిటి? – లక్ష్మీప్రసన్న, పోలింగ్ ఏజెంట్, పులివెందుల
ఓటు వేసేందుకు వెళ్తే గేట్లు మూసేశారు!
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లినప్పుడు పోలీసులు, టీడీపీ గూండాలు మమ్మల్ని అడ్డుకున్నారు. ‘‘ఓటు లేదు.. గీటు లేదు’’ అంటూ గేట్లు మూసేశారు. మహిళలమని కూడా చూడకుండా అవమానకరంగా మాట్లాడి ఓటు వేసే అవకాశం లేకుండా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం బాధాకరం. ప్రజల ఓటు హక్కును కాలరాసే ఈ విధానాన్ని అందరూ వ్యతిరేకించాలి! – చిట్టెమ్మ, మహిళా ఓటరు, పులివెందుల
రీపోలింగ్ జరపాలి
చిలకలూరిపేట 17వ వార్డులో కూటమి నాయకులు దొమ్మీగా వచ్చి పోలింగ్ కేంద్రంలో చొరబడ్డారు. అందరినీ బయటకు వెళ్లగొట్టి రిగ్గింగ్ చేశారు. వార్డులోని అనేక మందిని ఓటు వేయకుండా అడ్డుకున్నారు. మహిళలు ఆగ్రహించి తమకు ఓటు హక్కు కల్పించాలంటూ నిరసన తెలిపారు. ఇదేమని ప్రశ్నించిన నాపై సైతం దాడికి పాల్పడ్డారు. ఇక్కడ గంటసేపటికి పైగా దొంగ ఓట్లు వేశారు. స్థానికేతరులు వేసిన దొంగ ఓట్లపై క్షేత్రస్థాయి విచారణ చేసి రీపోలింగ్ నిర్వహించాలి. స్థానికులకు ఓటు హక్కు కల్పించాలి. – కొండెబోయిన రాజశేఖర్, పోలింగ్ ఏజెంటు, చిలకలూరిపేట, పల్నాడు జిల్లా
బెదిరించి బయటకు పంపారు
చిలకలూరిపేట 32వ వార్డు సంజీవనగర్ చర్చి పక్కనే ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు లోనికి వెళ్లగా కార్లలో ఒక్కసారిగా గుంపులు గుంపులుగా వచ్చి ఓటు వేసేవారిని బెదిరించి బయటకు పంపేశారు. మహిళలని కూడా చూడకుండా తోసేశారు. పోలింగ్ కేంద్రంలోని వారిని భయపెట్టి దౌర్జన్యంగా బయటకు పంపారు. దొంగ ఓట్లు వేశారు. అందుకే ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించటం బాధాకరం. – కె రత్నస్వరాజ్, ఓటరు, చిలకలూరిపేట, పల్నాడు జిల్లా
మా వార్డులో 85 శాతం పోలింగ్ ఎప్పుడూ జరగలేదు
బుచ్చిరెడ్డిపాళెంలోని 14వ వార్డులో నమోదైన పోలింగ్ శాతం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతవరకు ఇక్కడ ఈ స్థాయిలో పోలింగ్ ఎప్పుడూ నమోదు కాలేదు. ఇందుకూరుపేటకు చెందిన టీడీపీ మాజీ కన్వీనర్ వీరేంద్ర తమ మనుషులతో ఇక్కడ తిష్టవేసి ఓట్లన్నీ తమకు అనుకూలంగా చేసుకున్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఏజెంట్లను బెదిరించడంతో వారు మౌనంగా ఉండిపోయినట్లు చెబుతున్నారు. ఈ వార్డులోని 14/1 కేంద్రంలో 84.75 శాతం, 14/2 కేంద్రంలో 80.86 శాతం పోలింగ్ నమోదైంది. – తాండ్ర శ్రీనివాసులు, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు జిల్లా
నా ఓటు ముందే వేసేసుకున్నారు
మార్కాపురం 10వ వార్డులోని మెప్మా ఆఫీసు పరిధిలో అంగన్‌వాడీ స్కూల్ ఈస్ట్‌ఫేసింగ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు మధ్యాహ్నం 12 గంటలకు వెళ్లాను. లైన్‌లో నిలబడి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటరు స్లిప్‌ను ఎన్నికల సిబ్బందికి ఇచ్చాను. వారు నా స్లిప్‌ను పరిశీలించి నా ఓటు వేసేశారని తెలిపారు. నా ఓటును ఎవరో ఎందుకు వేస్తారు అని ప్రశ్నించి నా ఆధార్‌కార్డును ఎన్నికల అధికారికి ఇచ్చాను. దీంతో అధికారి అక్కడున్న ఏజెంట్లను అడగ్గా నా ఓటు వేసి వెళ్లారని సమాధానమిచ్చారు.
నా ఓటు నేను కాకుండా ఎవరు వేస్తారని ప్రశ్నించగా మాకేం తెలీదు.. ఏమైనా ఉంటే బయటకెళ్లి విచారించుకోవాలని అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. రిగ్గింగ్ చేయడం వల్లే ఓటేయలేకపోయాను. ఓటు వేసేందుకు ఒంగోలు నుంచి 95 కిలోమీటర్ల దూరం వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. – యు.గౌరీశంకర్, మార్కాపురం మున్సిపాలిటీ, మార్కాపురం జిల్లా
స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం లేదు
పెద్దాపురంలో సగటు ఓటరు నిర్భయంగా ఓటు వేసేందుకు అవకాశం లేకుండా పోయింది. 27వ వార్డులో కూటమి నాయకులు దగ్గరుండి చనిపోయినవారి ఓట్లు వేయించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కూటమి నాయకులు, కార్యకర్తలు గుమిగూడినా పోలీసులు పట్టించుకోలేదు. – ఆర్.గోపి, పెద్దాపురం, కాకినాడ జిల్లా
గుంపులుగా రౌడీమూకలు
చిత్తూరులోని 51వ డివిజన్‌లో ఓటు వేసేందుకు వెళ్తే, అక్కడ గుంపులుగా రౌడీమూకలు తిరుగుతున్నారు. భయం వేసి తిరిగి ఇంటికి వచ్చేశాను. అక్కడ స్థానికుల కంటే ఇతర ప్రాంతాల వారే ఎక్కువగా ఉన్నారు. అయినా పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించకుండా ప్రేక్షక పాత్ర వహించారు. ఓటు వేసేందుకు స్వేచ్ఛ లేకపోవడంతో నేను ఓటు వేయలేక నా హక్కును కోల్పోయాను. – మోహన్, తోటపాళ్యం, చిత్తూరు
ఓటర్లు లేకుండా 70 శాతం పోలింగా?
నేను 6వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థిని. నా భర్తను తెల్లవారుజామునే పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. నేను పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్తే తెలుగుదేశం గూండాలు దౌర్జన్యం చేశారు. ఓటర్లు ఓట్లు వేయకుండా సుమారు 70 శాతం పోలింగ్ ఎలా జరిగింది? కనీసం అభ్యర్థులమైన మమ్మల్నే ఓట్లు వేయనీయలేదు. ప్రజలు ఓట్లు ఎలా వేశారు. ఇంత దుర్మార్గంగా, దౌర్జన్యంగా దొంగ ఓట్లు వేసుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. – అంజలి, 6వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, మాచర్ల, పల్నాడు జిల్లా
నా వయసు 80 ఏళ్లు.. ఇంత దౌర్జన్యాన్ని ఎన్నడూ చూడలేదు
నాకు 80 ఏళ్లు. ఎన్నో ఎన్నికలు చూశాను. నేను ఓటు వేయటానికి వెళితే నా వయసును కూడా చూడకుండా దౌర్జన్యంగా వ్యవహరించి ఓటు వేయనీయలేదు. ఇదేం ప్రజాస్వామ్యం? నేను ఈ వయసులో ఓటు వేయటానికి ఆనందంగా వస్తే అడ్డగించి అన్ని రకాలుగా బాధపెట్టి వెనక్కి పంపారు. ఇలాంటి దౌర్జన్యాన్ని నేనెప్పుడూ చూడలేదు. మీరు గెలవాలంటే అసలు ఎన్నికలు జరపకుండా చేసుకోండి అంతేగానీ ఓట్లు వేయటానికి వచ్చిన ప్రజల్ని అడ్డగించి మొత్తం మీకు మీరే ఓట్లు వేసుకుంటే ఏం సాధిస్తారు? నాలాంటి వృద్ధులు బాధపడితే రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని మరచిపోకండి. – వెంకటరెడ్డి మాచర్ల, పల్నాడు జిల్లా
పోలింగ్ శాతం అంతా రిగ్గింగ్ మహిమే
నాకు తాడిపత్రి 20వ వార్డులో ఓటు ఉంది. పట్టణ ప్రజలు ఓటు వేయకుండానే 66 శాతానికి పైగా ఓటింగ్ నమోదు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతా రిగ్గింగ్ మహిమే. టీడీపీ నాయకులు ప్రజలను ఓట్లు వేయనీయలేదు. ఉదయం 9 గంటల వరకు టీడీపీ సానుభూతిపరులు మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు. ఓటేయడానికి వచ్చిన ఇతరులపై దాడిచేశారు. పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ మూకలు తిష్టవేయడంతో నేను కూడా ఓటు వేయడానికి వెళ్లలేదు. పోలీసులు కూడా అధికారపార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరించారు. రిగ్గింగ్ చేసుకోవడంతోనే పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం నమోదైంది. – కేశవరెడ్డి, తాడిపత్రి, అనంతపురం జిల్లా
మా స్లిప్పులు దౌర్జన్యంగా చించేశారు
ప్రజాస్వామ్యంలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి ఉండాలి. కానీ పులివెందులలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రౌడీలు, గూండాల దౌర్జన్యాలు చూసి భయమేసింది. ఓటర్లపై రాళ్లు రువ్వుతూ, ఓటరు స్లిప్పులు చించివేస్తూ టీడీపీ రౌడీలు, గూండాలు ఓటు హక్కును అడ్డుకున్నారు. ఇలాంటి ఘటనలను నా జీవితంలో ఎన్నడూ చూడలేదు!– వెంకటలక్ష్మి, మహిళా ఓటరు, పులివెందుల
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన గూండాలు!
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లినప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు మా ఓటరు స్లిప్పులను లాక్కున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీకి చెందిన రౌడీలు, గూండాలే కనిపించారు. పులివెందుల ఓటర్లను స్వేచ్ఛగా ఓటు వేయనీయకుండా అడ్డుకున్నారు. మా ఓటు హక్కును మాకే దూరం చేశారు!– సుబ్బమ్మ, మహిళా ఓటరు, పులివెందుల
టీడీపీ గూండాలు, పోలీసుల కుమ్మక్కయ్యారు!
పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా ఓటు వేయకుండా అడ్డుకోవాలన్న లక్ష్యంతో టీడీపీ గూండాలు, పోలీసులు కుమ్మక్కయ్యారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న మహిళలను అడ్డుకున్నారు. పోలీసు అధికారులే టీడీపీ గూండాలతో చేతులు కలిపితే ఓటర్లకు న్యాయం ఎలా జరుగుతుంది? మహిళల ఓటు హక్కును సైతం అడ్డుకున్న పరిస్థితి ఏర్పడింది! – నాగమల్లేశ్వరి, మహిళా ఓటరు, పులివెందుల
ఓటేయలేకపోవడం ప్రాణం పోయినట్టుంది
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు ఉంది. కానీ ఆదివారం పులివెందులలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన వారిని టీడీపీ గూండాలు, రౌడీలు దౌర్జన్యాలతో అడ్డుకున్నారు. ఓటు వేయాలన్న కనీస హక్కును కూడా వినియోగించుకోలేని పరిస్థితి కల్పించారు. ఓటు వేయకుండా వెనుదిరగాల్సి రావడంతో ప్రాణం పోయినట్టనిపించింది!– భారతి, మహిళా ఓటరు, పులివెందుల
కర్రలు, రాళ్లతో దాడులు చేశారు!
మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు రాకుండా టీడీపీ గూండాలు, రౌడీలు భయభ్రాంతులకు గురిచేశారు. పోలింగ్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ మద్యం సేవించి, కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఇలాంటి దాడుల మధ్య మేం స్వేచ్ఛగా ఓటు హక్కును ఎలా వినియోగించుకోగలం?– సుశీల, మహిళా ఓటరు, పులివెందుల
పోలింగ్ కేంద్రాల చుట్టూ టీడీపీ అల్లరి మూకలే..!
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల చుట్టూ టీడీపీకి చెందిన అల్లరి మూకలు గుంపులు గుంపులుగా మోహరించాయి. ఓటు వేసేందుకు కేంద్రాల వద్దకు వెళ్లిన మమ్మల్ని ‘‘మీ ఓట్లు లేవు.. మీ ఓట్లు మేమే వేసుకున్నాం.. వెళ్లిపోండి’’ అంటూ బెదిరించారు. ఓటు వేయడానికి వచ్చిన మమ్మల్ని వెనక్కి పంపించారు! – మాణిక్యమ్మ, మహిళా ఓటరు, పులివెందుల
మహిళలపై దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూశారు!
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ రౌడీలు, గూండాలు ఓటర్లపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. మహిళా ఓటర్లపై కూడా దౌర్జన్యాలు జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే పట్టించుకోకపోవడం బాధాకరం. పులివెందులలో ఇలాంటి ఎన్నికలను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు! – నిర్మల, మహిళా ఓటరు, పులివెందుల
వృద్ధురాలినని కూడా చూడకుండా బెదిరించారు!
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లినప్పుడు టీడీపీ అల్లరి మూకలు నన్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. ‘‘ఈ వయసులో నీకు ఓటు అవసరమా? వెళ్లిపో’’ అంటూ బెదిరించాయి. వృద్ధురాలినని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడి అవమానించాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఉన్న ఓటు హక్కును కూడా గౌరవించలేదు! – సువార్తమ్మ, మహిళా ఓటరు, పులివెందుల
ఎన్నికలను భయానకంగా మార్చేశారు!
ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఓటర్లందరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి. కానీ పులివెందులలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నాయకులు బీహార్ తరహా పరిస్థితులను తలపించేలా అల్లర్లు, దౌర్జన్యాల మధ్య ఎన్నికలను నిర్వహించారు. ఇలాంటి ఎన్నికలను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు! – శాంతమ్మ, మహిళా ఓటరు, పులివెందుల
రౌడీయిజంతో గెలుపు ఓ గెలుపేనా?
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రజల ఓట్లతో గెలవాలి కానీ రౌడీయిజంతో కాదు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే అది నిజమైన గెలుపు అవుతుంది. కానీ పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గూండాలు, రౌడీలను పెట్టి పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు రాకుండా అడ్డుకున్నారు. – జయమ్మ, మహిళా ఓటరు, పులివెందుల
పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ దౌర్జన్యాలు..
ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న ఓటర్లను ఇష్టానుసారంగా అసభ్య పదజాలంతో దూషించారు. బెదిరింపులు, దౌర్జన్యాల మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధమైన వాతావరణమే కనిపించలేదు. – ప్రశాంతి, మహిళా ఓటరు, పులివెందుల


