పులివెందుల రీపోలింగ్ పిటిషన్‌పై కాసేపట్లో ఏపీ హైకోర్టు తీర్పు | The verdict on the petition for repolling in Pulivendula is set to be delivered shortly | Sakshi
Sakshi News home page

పులివెందుల రీపోలింగ్ పిటిషన్‌పై కాసేపట్లో ఏపీ హైకోర్టు తీర్పు

Nov 3 2026 6:59 AM | Updated on Nov 3 2026 7:13 AM

The verdict on the petition for repolling in Pulivendula is set to be delivered shortly

సాక్షి,అమరావతి: పులివెందులలో రీపోలింగ్‌ పిటిషన్‌పై కాసేపట్లో తీర్పు వెలువడనుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార యంత్రాంగం యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడిన నేపథ్యంలో పులివెందుల మునిసిపాలిటీకి చెందిన అన్ని వార్డుల్లో రీపోలింగ్‌ జరపాలని కోరుతూ ఏపీ హైకోర్టులో వైఎస్సార్‌సీపీ మునిసిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి వైఎస్‌ ప్రమీలమ్మ,ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సోమవారం హైకోర్టులో అత్యవసరంగా అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు.

 ఆ పిటిషన్‌లో రీపోలింగ్‌పై ఎన్నికల సంఘానికి (ఎస్‌ఈసీ) ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ మండవ కిరణ్మయి విచారణ జరిపారు.  ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ రోజు ఉదయం 7.30 గంటలకు రీ పోలింగ్‌పై నిర్ణయం వెలువరిస్తానని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement