కౌంటింగ్‌ కేంద్రంలో టీడీపీ గూండాల వీరంగం | Tension at Chilakaluripet Counting Centre | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌ కేంద్రంలో టీడీపీ గూండాల వీరంగం

Nov 3 2026 11:14 AM | Updated on Nov 3 2026 11:29 AM

Tension at Chilakaluripet Counting Centre

సాక్షి,పల్నాడు జిల్లా: చిలకలూరిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాలుగో వార్డుకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ శ్రేణులు వీరంగం సృష్టించాయి.

కౌంటింగ్ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని, కౌంటింగ్ ఏజెంట్లను టీడీపీ వర్గీయులు బెదిరిస్తూ భయాందోళనకు గురిచేశారు. ఏజెంట్లతో పాటు అనధికారికంగా కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన టీడీపీ శ్రేణులు.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థితో పాటు వారి ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించే ప్రయత్నం చేశాయి.

అధికార పార్టీ నాయకులు కౌంటింగ్ కేంద్రంలో ఇష్టానుసారంగా హల్‌చల్ చేస్తున్నప్పటికీ, అక్కడే ఉన్న పోలీసులు పట్టించుకోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కౌంటింగ్ కేంద్రంలో జరుగుతున్న ఈ పరిణామాలు స్థానికంగా కలకలం రేపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement