సాక్షి, విజయవాడ: ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగుల ఓటింగ్ సరళి కూటమి ప్రభుత్వానికి సవాలుగా మారినట్లు కనిపిస్తోంది. పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థులకు ఏకపక్షంగా ఓట్లు పడకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు సమానంగా ఓట్లు వేయడం చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను చూపిస్తోంది. పులివెందుల, నెల్లిమర్ల, పెడన, పిఠాపురం, ఉయ్యూరు, పలాసతో పాటు విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సరళి కూటమికి ప్రతికూలంగా కనిపించింది. ఈ పరిణామం చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తికి సంకేతాలుగా ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
🚨 స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఊహించని ఫలితాలు? కార్పొరేషన్ల మేయర్ ఎన్నికల్లో కూటమితో వైసీపీ ఢి అంటే ఢీ #LocalBodyElections2026 #GVMCElections2026 #PostalBallot https://t.co/JRdMjkb0Vs
— UttarandhraNow (@UttarandhraNow) November 3, 2026
స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల ఝలక్..
మరోవైపు.. విశాఖలోనూ కూటమి సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల్లో కూటమికి స్టీల్ ప్లాంట్ కార్మికులు ఝలక్ ఇచ్చారు. విశాఖ 105వ వార్డులో సీపీఎం అభ్యర్థి ఎం. కృష్ణయ్య విజయం సాధించారు. ఈ ఫలితంతో ఉక్కు కార్మికులు కూటమికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, కార్మికుల సమస్యల నేపథ్యంలో ఈ ఫలితం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి: కొనసాగుతున్న కౌంటింగ్.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయం


