ఎన్నిక‌ల ఫ‌లితాల్లోనూ 'కూట‌మి' కుట్రలు | Andhra Pradesh local body elections 2026 results: TDP dramas | Sakshi
Sakshi News home page

ఎన్నిక‌ల ఫ‌లితాల్లోనూ టీడీపీ కుయుక్తులు

Nov 3 2026 5:03 PM | Updated on Nov 3 2026 5:51 PM

Andhra Pradesh local body elections 2026 results: TDP dramas

ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌గ‌ర‌పాల‌క‌, ప‌ట్ట‌ణ‌, న‌గ‌ర పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కూటమి స‌ర్కారు కుట్రలు ప‌న్నుతోంది. ఎన్నిక‌లకు ముందు నామినేష‌న్లు వేయ‌కుండా అడ్డుకుని, పోలింగ్ స‌మ‌యంలో దౌర్జన్యాల‌కు దిగిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.. ఓట్ల లెక్కింపులోనూ అదే ధోరణి కొన‌సాగిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు గెలిచిన చోట కుయుక్తులు ప‌న్నుతూ ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తోంది. వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థుల‌కు అడుగ‌డుగునా ఆటంకాలు క‌ల్పిస్తూ అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి కుట్రలు
విశాఖప‌ట్నం న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లోనూ టీడీపీ కుట్ర‌ల‌కు దిగింది. వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థులు గెలిచిన చోట రీకౌంటింగ్ పేరుతో నాట‌కాల‌కు తెర తీసింది. చెల్లని ఓట్లను సాకుగా చూపించి రీకౌంటింగ్ జరపాలని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చింది. 19, 65 వార్డుల నుంచి వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థులు మోల్లి లక్ష్మి, షేక్ జన్నీరుషా కార్పొరేటర్లుగా ఎన్నికైనట్లు అధికారులు అధికారికంగా ప్ర‌క‌టించిన త‌ర్వాత కూడా ప‌చ్చ పార్టీ నేత‌లు రీకౌటింగ్ ప‌ట్టుబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం. అధికార పార్టీ నేత‌ల ఒత్తిడికి త‌లొగ్గి అధికారులు రీంకౌటింగ్ చేప‌ట్టారు. కూటమి అభ్యర్థులు తక్కువ ఓట్లతో గెలిచిన చోట్ల మాత్రం రీకౌంటింగ్‌కు అధికారులు స‌సేమీరా అంటున్నారు. అధికారుల తీరుపై వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ముందంజ‌లో ఉన్నార‌ని.. 
వైఎస్సార్ జిల్లా కడప 33వ వార్డులో గంటన్నర నుంచి కౌంటింగ్ నిలిపివేశారని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మద్దిక సంధ్య రాణి భర్త దేవిరెడ్డి ఆదిత్య తెలిపారు. వైఎస్సార్‌సీపీ  అభ్యర్థి ముందంజలో ఉన్నారన్న నెపంతో కౌంటింగ్ ఆపేశారని ఆరోపించారు. మొదటి రౌండు పూర్తి అయ్యేసరికి త‌న భార్య‌ 157 ఓట్ల మెజారిటీలో ఉన్నట్లు తెలిపిన ఆదిత్య వెల్ల‌డించారు. 

టీడీపీ నేతల దౌర్జన్యం
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. 33 డివిజన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి  పునీత 53 ఓట్లతో విజ‌యం సాధించారు. వైఎస్సార్‌సీపీ విజ‌యాన్ని జీర్ణించుకోలేక టీడీపీ నేత‌లు అక్ర‌మాల‌కు తెర తీశారు. పునీత తోపాటు ఏజెంట్ శివను కౌంటింగ్ కేంద్రం నుంచి బ‌య‌ట‌కు గెంటేశారు. శాప్ ఛైర్మన్ రవి నాయుడు, జేబీ శ్రీనివాస్.. అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి రీకౌంటింగ్‌కు ప‌ట్టుబ‌ట్టారు. టీడీపీ అరాచ‌కాల‌ను వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్య‌తిరేకించింది.

కౌంటింగ్ కేంద్రం నుంచి గెంటేసి..
చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీలోనూ టీడీపీ కుట్ర‌ల‌కు తెర లేపింది. వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థి విజ‌యాన్ని అడ్డుకునేందుకు కుయుక్తులు ప‌న్నుతున్నారు. 34వ వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సల్మా భారతి 6 ఓట్ల‌తో గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. టీడీపీ అభ్య‌ర్థి కోరిక మేర‌కు రీకౌటింగ్ నిర్వ‌హించినా అదే ఫ‌లితం రావ‌డంతో టీడీపీ నేత‌లు దౌర్జ‌న్యానికి దిగారు. ఎన్నికల అధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  సల్మా భారతిని  కౌంటింగ్ కేంద్రం నుంచి గెంటివేశారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద సల్మా భారతి ఆందోళనకు దిగారు.

ఇదీ చ‌ద‌వండి: టీడీపీ రిగ్గింగ్‌ చేసిన చోట వైఎస్సార్‌సీపీ ఘన విజయం

పల్నాడు జిల్లా సత్తెనపల్లి 11వ వార్డులో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కృపావరం నాలుగు ఓట్లతో గెలుపొందారు. అయితే టీడీపీ నేత‌ల ఒత్తిడితో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజ‌యాన్ని డిక్లేర్ చేయకుండా అధికారులు పెండింగ్‌లో పెట్టారు. అధికారుల తీరుపై వైఎస్సార్‌సీపీ నేత‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.

బేతంచర్లలో వైఎస్సార్‌సీపీ నిర‌స‌న‌
నంద్యాల జిల్లా బేతంచర్ల ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెల‌కొంది. టీడీపీ నాయ‌కుల ఒత్తిడితో వైఎస్సార్‌సీపీ అభ్యర్దులు గెలిచిన చోట రీ కౌంటింగ్‌కి ఎన్నికల అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు ఆందోళ‌న‌కు దిగారు. టీడీపీ నేత‌ల‌ను వ‌దిలేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్దులపై పోలీసులు బెదింరింపుల‌కు దిగ‌డంతో ఉద్రిక్తత ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement