పచ్చమూకల దాడి.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త మునిరత్నం పరిస్థితి విషమం! | YSRCP Agent Muniratnam in Critical Condition | Sakshi
Sakshi News home page

పచ్చమూకల దాడి.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త మునిరత్నం పరిస్థితి విషమం!

Nov 6 2026 4:45 PM | Updated on Nov 6 2026 5:12 PM

YSRCP Agent Muniratnam in Critical Condition

సాక్షి,చిత్తూరు: కార్పొరేషన్ పరిధిలో పచ్చమూకలు పేట్రేగిపోయారు. రాజకీయ హింసకు పాల్పడ్డారు. ప్రజాస్వామ్య బద్ధంగా పోలింగ్ ఏజెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై అత్యంత పాశవికంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్ మునిరత్నం పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

నవంబర్‌ 1న  చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని తోటపాల్యం ప్రాంతంలో జరిగిన పోలింగ్‌లో మునిరత్నం వైఎస్సార్‌సీపీ తరఫున పోలింగ్ ఏజెంట్‌గా వ్యవహరించారు. ఎన్నికల విధుల్లో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారనే కక్షతో స్థానిక అధికార పార్టీ టీడీపీ నేతలు ఆయనపై కక్ష గట్టారు.

ఈ క్రమంలో పోలింగ్ విధులను ముగించుకుని రాత్రి సమయంలో ఇంటికి వెళుతున్న మునిరత్నాన్ని లక్ష్యంగా చేసుకుని దుండగులు అదను చూసి దాడికి తెగబడ్డారు. స్థానిక టీడీపీ నేత షణ్ముగం ఆదేశాల మేరకే ఈ పచ్చ గ్యాంగ్ రంగంలోకి దిగింది. షణ్ముగం కుమారుడు చందు, ఆయన అనుచరుడు గణేష్‌లు ఈ దాడికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించారు. చీకటిని ఆసరాగా చేసుకుని ఏజెంట్‌గా కూర్చున్న షణ్ముగంపై విచక్షణారహితంగా పిడిగుద్దులు కురిపించి, బలమైన ఆయుధాలతో దాడి చేయడంతో మునిరత్నం అక్కడికక్కడే స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయారు.

విషమంగా మారిన ఆరోగ్య పరిస్థితి..
దాడి జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు స్పందించి ఆయన్ను హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పాటు, తీవ్రమైన తలగాయాల కారణంగా మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి అత్యవసరంగా తమిళనాడులోని రాణిపేట సీఎంసీ  ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో మునిరత్నంకు అత్యవసర శస్త్రచికిత్స  నిర్వహించగా.. మెదడు వాపు, రక్తం గడ్డకట్టడం తీవ్రమవడంతో ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

పోలీసుల మౌనంపై విమర్శలు..
పాలక పార్టీ నేతల కనుసన్నల్లోనే ఈ కిరాతక దాడి జరిగిందని వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఏజెంట్లపైనే భౌతిక దాడికి దిగడం హేయమైన చర్య అని మండిపడ్డారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement