టీడీపీ నాయకులకు సూచనలిస్తున్న ఉపాధ్యాయుడు రాజశేఖర్
ఉలవపాడు(ఒంగోలు): అతను ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. కానీ అన్నీ తానై ఎన్నికల ఓటింగ్‌లో కీలక పాత్ర పోషించాడు. అతనే కొల్లూరుపాడు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు ›రాయపాటి రాజశేఖర్. పేరుకు ఉపాధ్యాయుడైనా తెలుగుదేశం పార్టీకి అన్నీతానై నడిపిస్తున్నాడు. ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని తెలిసినా అధికార పార్టీ వ్యక్తిని అనే ఉద్దేశంతో గురువారం ఉలవపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద తిష్ట వేశారు.
టీడీపీ నాయకులతో ముచ్చటిస్తూ, సలహాలిస్తూ, ఓటర్లను ప్రలోభపెడుతూ హల్‌చల్ చేశాడు. పోస్టల్ బ్యాలెట్ల కోసం పలువురిని బెదిరించేందుకు కూడా వెనుకాడలేదు. ఇదిలా ఉండగా సదరు గురువుగారికి ఎన్నికల విధులు అప్పగించలేదు. ఆయన ఓటు ఆ బూత్‌లో లేదు. అతను పనిచేసే స్కూల్ కూడా కాదు. కానీ పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ప్రచారం చేస్తుండటాన్ని చూసిన వారంతా ఔరా అని ముక్కున వేలేసుకున్నారు.
ఇదీ చదవండి: వారెవ్వా.. 104.27 శాతం పోలింగ్


