వారెవ్వా.. 104.27 శాతం పోలింగ్‌ | Nellore Elections Controversy, 611 Votes Polled Against 586 Voters, 104.27% Voting Recorded At Booth, Check More Details Inside | Sakshi
Sakshi News home page

వారెవ్వా.. 104.27 శాతం పోలింగ్‌

Nov 6 2026 11:25 AM | Updated on Nov 6 2026 11:51 AM

Record Polling In Nellore Local Body Elections

సాక్షి,నెల్లూరు: మండలంలోని తూర్పుపల్లి పోలింగ్‌ స్టేషన్‌ 25లో పోలింగ్‌ శాతం రికార్డు బద్దలు కొట్టింది. రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలతో కూటమి నేతలు, పోలింగ్‌ అధికారులు ఏకంగా 104.27 శాతం పోలింగ్‌ నిర్వహించి చరిత్ర సృష్టించారు. గురువారం పోలింగ్‌కు ముందు మంత్రి ఆనం తన అనుచరులకు ఫోన్‌ చేసి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు నెట్టేసి రిగ్గింగ్‌ చేయాలని ఆదేశించారు. 

దీంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు బరితెగించి చేసిన రిగ్గింగ్‌ బట్టబయలైంది. తూర్పుపల్లిలోని పోలింగ్‌ స్టేషన్‌ 25లో మొత్తం ఓటర్లు 586 మంది ఉన్నాయి. ఇక్కడ వైఎస్సార్‌సీపీ తరఫున కూర్చున్న ఎన్నికల ఏజెంట్లను తొలి గంటలోనే బయటకు తరిమేశారు. ఆ తరువాత కూటమి నేతలు ఓటరు జాబితాలో ఉన్న అందరి ఓట్లను చనిపోయిన ఓటర్లతో సహా ఓటు వేసినట్లు బ్యాలెట్‌ బాక్స్‌లో నింపారు. 

కూటమి నేతలు అంతటితో తృప్తి  తీరక అదనంగా మరో 25 బ్యాలెట్లను కూడా బాక్స్‌లో వేశారు. ఎన్నికల అధికారులు మొత్తం బ్యాలెట్లను లెక్క పెట్టి పోలైన ఓట్ల బ్యాలెట్లను చివరిలో సరి చూడగా 611 ఓట్లు పోలైనట్లు 104.27 శాతం నమోదైనట్లు పోలింగ్‌ అధికారి మండల అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇదే సమాచారాన్ని జిల్లా అధికారులు కూడా పంపారు. అధికారులు అధికారికంగా వెల్లడించిన పోలింగ్‌ శాతం బయటకు పొక్కడంతో నేతలు చేసిన ఓట్ల దొంగతనం బయటపడి ఏమి చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.    


అధికారులు ఇచ్చిన పట్టికలోనే నిర్ధారించిన పోలింగ్‌ శాతం    

ఇదీ చదవండి: మేము కూటమిలో ఉన్నామా?, లేదా?


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement