రాప్తాడు ఘటన: సాహస విద్యార్థినికి వైఎస్‌ జగన్‌ పరామర్శ | YSRCP Chief YS Jagan praises the brave student in the Raptadu incident | Sakshi
Sakshi News home page

ఆమె వైద్య ఖర్చులను పార్టీ భరిస్తుందని వైఎస్‌ జగన్‌ హామీ

Nov 3 2026 6:18 PM | Updated on Nov 3 2026 7:16 PM

YSRCP Chief YS Jagan praises the brave student in the Raptadu incident

తాడేపల్లి : రాప్తాడు ఘటనలో తన స్నేహితురాల్ని రక్షించడానికి సాహసం చూపిన విద్యార్థిని లక్ష్మిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. లక్ష్మికి ఫోన్‌ చేసిన వైఎస్‌ జగన్‌.. స్నేహితురాలిని రక్షించేందుకు ప్రాణాలకు తెగించిన ఆమె ధైర్యాన్ని అభినందించారు. లక్ష్మికి మెరుగైన వైద్యం కోసం అవసరమయ్యే ఖర్చును పార్టీ భరిస్తుందని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. వైద్య ఖర్చులతో పాటు లక్ష్మి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

‘చిన్న వయసులోనే తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. స్నేహితురాలిని కాపాడేందుకు లక్ష్మి తెగువ చూపింది. ఇలాంటి కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలి, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. లక్ష్మికి మెరుగైన వైద్యం కోసం వైఎస్సార్ సీపీ సహకరిస్తుంది. ఆమె కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం. వైద్యులతో మాట్లాడి లక్ష్మి ఆరోగ్య పరిస్థితిని..అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకోవాలని తోపుతుర్తి ప్రకాష్ రెడ్డిని ఆదేశించా. 

అవసరమైతే ప్రైవేట్‌ ఆసుపత్రిలో మరింత మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలి. గోపిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవటం లక్ష్మీ స్నేహ భావానికి నిదర్శనం. లక్ష్మి ఆరోగ్యంగా కోలుకుని తిరిగి చదువుపై దృష్టి పెట్టాలని ఆకాంక్షిస్తున్నా. చదువుతో పాటు కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున అందిస్తాం’  అని వైఎస్‌ జగన్‌  స్పష్టం చేశారు. 

ఇదీ చదవండి:  టీడీపీ రిగ్గింగ్‌ చేసిన చోట వైఎస్సార్‌సీపీ ఘన విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement