లాటరీ పద్ధతిలో విజేత.. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి అరుణ గెలుపు | Winner of the lottery method YSRCP councilor candidate Aruna wins | Sakshi
Sakshi News home page

లాటరీ పద్ధతిలో విజేత.. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి అరుణ గెలుపు

Nov 3 2026 6:19 PM | Updated on Nov 3 2026 7:18 PM

Winner of the lottery method YSRCP councilor candidate Aruna wins

పలాస/కడప/తిరుపతి/విశాఖ: శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉత్కంఠభరితంగా 35వ వార్డు ఫలితం తేలింది. 35వ వార్డులో వైఎస్సార్‌సీపీ, టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థికి 340 ఓట్లురాగా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి కూడా అదే సంఖ్యలో ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు లాటరీ పద్ధతిలో విజేతను నిర్ణయించారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి అరుణ గెలుపొందారు.

కడప కార్పొరేషన్ కౌంటింగ్‌లో తీవ్ర జాప్యం
మరోవైపు, వైఎస్సార్ జిల్లా కడప కార్పొరేషన్ కౌంటింగ్‌లో తీవ్ర జాప్యం జరిగింది. ఇప్పటివరకు కేవలం పోస్టల్ బ్యాలెట్ ఫలితాలను మాత్రమే అధికారులు విడుదల చేశారు. బ్యాలెట్ పేపర్లు కట్టలు కడుతున్నామంటూ సిబ్బంది చెబుతున్నారు. కౌంటింగ్ అర్ధరాత్రి వరకూ కొనసాగే అవకాశం ఉంది.

తిరుపతి జిల్లాలోని నాయుడుపేట మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో కూటమి కుట్రలకు పాల్పడింది. వైఎస్సార్‌సీపీ చైర్ పర్సన్ అభ్యర్థికి 484 ఓట్లు లీడింగ్ రావడాన్ని జీర్ణించుకోలేకపోయింది. రెండో రౌండ్ ప్రారంభంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్స్‌ను వెళ్లగొట్టారు. సమాచారం అందుకుని ప్రశ్నించడానికి ఎక్కడ వస్తారో అన్న భయంతో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై పోలీసులతో దాడి చేయించారు. మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యను అదుపులోకి తీసుకుని, పలువురు వైఎస్సార్‌సీపీ శ్రేణులను వెళ్లగొట్టారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను బూతులు తిడుతూ లాఠీలతో కొట్టుకుంటూ వెళ్లగొట్టారు సీఐ వెంకటరమణ. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ గెలుపొందిన 2వ వార్డును రీ కౌంటింగ్ పేరుతో తమ ఖాతాలో వేసుకుంది టీడీపీ. సీఐ తీరుపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీవీఎంసీ ఎన్నికల్లోనూ కూటమి కుట్రలకు పాల్పడింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచిన చోట రీ కౌంటింగ్ కు టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. చెల్లని ఓట్లతో రీ కౌంటింగ్ జరపాలని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. మోల్లి లక్ష్మి, షేక్ జన్నీరుషా వైఎస్సార్‌సీపీ తరఫున కార్పొరేటర్లుగా విజయం సాధించారు. 19, 65 వార్డుల నుంచి కార్పొరేటర్లుగా ఎన్నికైనట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. టీడీపీ నేతలు ఒత్తిడితో రీకౌంటింగ్ జరుపుతున్నారు అధికారులు. అధికారుల తీరుపై వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ‍్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement