బియ్యం కడిగిన నీటితో ‘లాబ్‌’ ద్రావణం! | Sagubadi: Conventional and Scientific uses of Rice-washed water | Sakshi
Sakshi News home page

బియ్యం కడిగిన నీటితో ‘లాబ్‌’ ద్రావణం!

Nov 6 2026 5:39 PM | Updated on Nov 6 2026 6:07 PM

Sagubadi: Conventional and Scientific uses of Rice-washed water

బియ్యం కడిగిన నీరు, పాలు, కొద్దిగా బెల్లం కలిపి తయారు చేసే ద్రావణాన్ని ‘లాక్టోబాసిల్లస్‌‘ (లాక్టిక్‌ యాసిడ్‌ బ్యాక్టీరియా) సీరమ్‌ లేదా ‘లాబ్‌’ ద్రావణం అంటారు. 

1. ఇది మొక్కలకు ఒక అద్భుతమైన, సూక్ష్మపోషకాలను 
అందించే సేంద్రియ ద్రావణం. ఇది నేలను సారవంతం చేసి, మొక్కలను ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.
2. ఒక కప్పు బియ్యం శుభ్రం చేసేటప్పుడు వచ్చే మొదటి నీటిని (తెల్లటి నీరు) ఒక గాజు లేదా ప్లాస్టిక్‌ సీసాలో సగం వరకు తీసుకోవాలి.
3. ఆ నీటిలో 1/4 కప్పు పాలు 
(పచ్చి పాలు అయితే  మంచిది). దీనికి ఒక స్పూన్‌ బెల్లం  కలపాలి.
4. సీసా మూతను గట్టిగా బిగించకుండా, గాలి ఆడేలా లూజుగా ఉంచి, చీకటి ప్రదేశంలో 3 నుంచి 5 రోజుల పాటు నిల్వ ఉంచాలి.
5. 3–4 రోజుల తర్వాత మిశ్రమం పైన తెల్లటి పదార్థం గడ్డకట్టిన పాలు తేలుతుంది. దానిని తీసేయాలి. కింద పసుపు రంగు ద్రవం ఉంటుంది. ఇదే లాక్టోబాసిల్లస్‌ సీరమ్‌. దీన్నే ‘లాబ్‌’ ద్రావణం అంటాం. 
6. ఈ ద్రావణం చాలా గాఢత కలిగి ఉంటుంది. కాబట్టి 1 భాగం లాబ్‌ ద్రావణానికి 10 నుంచి 15 భాగాలు సాధారణ నీటిని కలిపి బాగా పలచగా చేయాలి.  అంటే 2 లేదా 3 ఎం.ఎల్‌. లాబ్‌ ద్రావణానికి 1 లీటర్‌ నీరు కలపాలి. 
7. ఈ పలచని ద్రావణాన్ని మొక్కల మొదళ్ళలో మట్టిలో పోయాలి. ఆకులపై స్ప్రే కూడా చేయవచ్చు.
8. ఇందులో ఉండే లాక్టోబాసిల్లస్‌ బ్యాక్టీరియా నేలలోని చెడు బ్యాక్టీరియాని నాశనం చేసి, వేర్ల వ్యవస్థను బలపరుస్తుంది. 
9. బియ్యంలో ఉండే పిండి పదార్థాలు, 
పాలలోని కాల్షియం, విటమిన్లు మొక్కలకు అందుతాయి. 
10. ఆకులపై చల్లటం వల్ల ఆకు ముడత, 
బూజు తెగుళ్లు వంటివి రాకుండా అడ్డుకుంటుంది. 
11. పండ్ల మొక్కలు, టమాటా, మిరప, వంగ లాంటి కూరగాయలు మొక్కలు, పూల మొక్కలకు ఇది చాలా మంచి సూక్ష్మజీవుల ద్రావణం. నెలకు 2 సార్లు మాత్రమే దీన్ని వాడాలి. ఎక్కువగా వాడితే నేల మొక్కలకు, నేలకూ తీవ్రమైన నష్టం కలుగుతుంది. 
12. లాబ్‌ ద్రావణంలో ఉండే ఆమ్ల గుణం ఎక్కువైతే మొక్కల వేర్లను దెబ్బతీసి, వేరు కుళ్లు తెగులుకు దారితీస్తుంది.

13.  లాబ్‌ ద్రావణాన్ని నేరుగా ఆకులపై పిచికారీ చేసినప్పుడు లేదా మట్టిలో ఎక్కువ మోతాదులో ఇచ్చినప్పుడు ఆకులు పసుపు రంగులోకి మారి చివర్లు మాడిపోతాయి.

14. ఎక్కువ మొత్తంలో పోషకాలు, సూక్ష్మజీవులు చేరటం వల్ల మొక్కలు అధిక ఒత్తిడికి గురై ఎదుగుదల ఆగిపోతుంది.

15. ఇంట్లో ఉండే పుల్ల మజ్జిగలో కూడా లాక్టోబాసిల్లస్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది మొక్కలకు అద్భుతమైన సూక్ష్మపోషకాలను (కాల్షియం, ప్రోటీన్లు) అందిస్తుంది. 

ఒక లీటరు నీటిలో 10–15 మి.లీ. అంటే దాదాపు ఒక స్పూన్‌ పుల్లమజ్జిగను బాగా కలపాలి. ఇలా తయారు చేసిన ద్రావణాన్ని కుండీలోని మట్టిలో తేమ ఉన్న సమయంలో పోయాలి. ఈ ద్రావణాన్ని వడకట్టి, మొక్కల ఆకులపై పిచికారీ చేయటం వల్ల బూజు తెగులు వంటివి రాకుండా ఉంటాయి. దీన్ని ప్రతి 15 రోజులకొకసారి మొక్కలకు ఇవ్వటం మంచిది.  

కొల్లి కృష్ణ కుమారి,
అడ్మిన్, గుంటూరు జిల్లా 
మిద్దె తోటల బృందం
మొబైల్‌: 94906 02366 

ఇదీ చదవండి: తునికి పండుతో కలిగే లాభాలు ఇవే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement