దీపావళి వేళ ఆదివారం స్టాక్ మార్కెట్ ప్రత్యేక ట్రేడింగ్! | Diwali 2026 Muhurat Trading BSE NSE Host Special Stock Market Session on sunday | Sakshi
Sakshi News home page

దీపావళి వేళ ఆదివారం స్టాక్ మార్కెట్ ప్రత్యేక ట్రేడింగ్!

Nov 7 2026 9:34 AM | Updated on Nov 7 2026 9:34 AM

Diwali 2026 Muhurat Trading BSE NSE Host Special Stock Market Session on sunday

దీపావళి పండగ వేళ కొత్త పెట్టుబడులు ప్రారంభించడాన్ని మదుపర్లు అత్యంత శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీదేవి పూజ జరుపుకునే ఈ పర్వదినాన ఏ చిన్న శుభకార్యం లేదా వ్యాపారం ప్రారంభించినా విజయం వరిస్తుందని, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో, ముఖ్యంగా దలాల్ స్ట్రీట్‌లో ఈ ఆనవాయితీ దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ రోజున స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తే వచ్చే దీపావళి నాటికి లాభాల పంట పండుతుందనే బలమైన విశ్వాసంతో సాధారణ మదుపర్ల నుంచి బడా ఇన్వెస్టర్ల వరకు అందరూ ‘మూరత్‌ ట్రేడింగ్’లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతారు.

ఈసారి మూరత్ ట్రేడింగ్ వివరాలు

ఈ సంప్రదాయాన్ని నిలబెడుతూ మన దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలైన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ఈసారి ఆదివారం నవంబర్ 08, 2026న దీపావళి లక్ష్మీ పూజ సందర్భంగా గంటపాటు ప్రత్యేక మూరత్‌ ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. దీనికి సంబంధించిన కచ్చితమైన టైమింగ్‌, ప్రీ-ఓపెనింగ్ సెషన్ వివరాలను ఎక్స్ఛేంజీలు త్వరలోనే అధికారిక సర్క్యులర్ ద్వారా విడుదల చేయనున్నాయి. సాధారణంగా ఏటా లక్ష్మీ పూజ సమయాన సాయంత్రం వేళ ఈ గంట సేపటి ప్రత్యేక సెషన్‌ను నిర్వహిస్తుంటారు.

మదుపర్ల వ్యూహం

దశాబ్దాల చరిత్రను పరిశీలిస్తే మూరత్‌ ట్రేడింగ్ రోజున మార్కెట్లు సూచీలు లాభాల్లోనే ముగిసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే ఇది కేవలం ప్రతీకాత్మకమైనది కాబట్టి, మదుపర్లు దీర్ఘ కాలానికి మంచి రాబడులు ఇచ్చే బలమైన ఫండమెంటల్స్ ఉన్న క్వాలిటీ షేర్లలో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్తగా మార్కెట్లోకి అడుగుపెట్టేవారికి ఈ రోజు
శుభారంభం అని చెప్పవచ్చు.

ఇదీ చదవండి: మాదేశం వచ్చినవారికి గుడ్‌న్యూస్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement