తొలి సింగిల్‌ మదర్‌ ‘సీతమ్మే’..! ఆ బంధం.. | Ramanand Sagar's Ramayan Actor Dipika Chikhlia Calls Sita First Single Mother | Sakshi
Sakshi News home page

Dipika Chikhlia: మొట్టమొదటి సింగిల్‌ మదర్‌ ‘సీతమ్మే’..! ఆ బంధం..

Nov 7 2026 11:34 AM | Updated on Nov 7 2026 11:38 AM

Ramanand Sagar's Ramayan Actor Dipika Chikhlia Calls Sita First Single Mother

రామానంద సాగర్ దర్శకత్వం వహించిన అద్భుత ధారావాహిక ‘రామాయణం’ భారత్‌లో సుమారు 82 శాతం మంది ప్రేక్షకులను ఆకట్టుకుని చరిత్ర సృష్టించింది. మళ్లీ లాక్‌డౌన్‌ సమయంలో ప్రసారం కాగా..సుమారు రికార్డు స్థాయిలో 77 మిలియన్ల (7.7 కోట్లు) మంది వీక్షించారు. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించిన టీవీ షోలలో ఒకటిగా నిలిచింది. అలాంటి భక్తిరస ధారావాహిక రామాయణంలో సీతగా అద్భుతంగా నటించిన దీపికా చిఖ్లియాను ఏ అభిమాని అంతతేలిగ్గా మర్చిపోలేరు. 

ఎందుకంటే..సీత అంటే ఇలానే ఉంటుంది అనేలా అద్భుత రూప లావణ్యాలతో ఆకట్టుకున్న నటి దీపికా. ఇటీవల నితీష్ తివారీ ధర్వకత్వంలో తెరకెక్కిన రామాయణంలో సాయిపల్లవి ఆ పాత్రను పోషించి ప్రేక్షకుల చేత నూటికి నూరు మార్కులు వేయించుకుని ప్రశంసలందుకుంది. మహాసాధ్వీమణి సీత పాత్రకు దాదాపు న్యాయం చేయడం అంటే చాలా పెద్ద సవాలు. 87ల టైంలో ఆ పాత్రలో ఒదిగిపోయి అందరిని మెప్పించి..నేటి వరకు ప్రేక్షకుడి మదిలో గుర్తుండిపోయేలా స్థానం దక్కించుకున్న క్రెడిట్‌ మాత్రం దీపికదే అని చెప్పాలి. 

ఈ మేరకు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న నాటి సీత దీపికా..ఆ పాత్రకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుందామె. సీతలా ఆదర్శమూర్తిగా ఉండగలరా అని అడగగా అందుకు దీపకా అవుననే సమాధానమిచ్చారు. అలాగే సీతలో ఉన్న బలాన్ని, ఆ పాత్రపై తనకున్న అభిప్రాయాలను పంచుకుందామె. తన దృష్టిలే సీతమ్మే తొలి సింగిల్‌ మదర్‌ అని అన్నారామె. కానీ అంతా సీతమ్మను సౌమ్యురాలుగా, బలహీనంగా చూస్తారు. ఆమె చాలా బలమైన మహిళ. సందర్భోచితంగా తన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ..తన సొంత అభిప్రాయాలకే కట్టుబడి వని ధీర వనిత అని అంటోంది. అందుకు ఉదాహరణ రాముడి వనవాస ఘట్టమే అని అంటుంది. 

ఆ ఘట్టంలో ఆమె అరణ్యవాసానికి వద్దు అని కుటుంబ సభ్యులు, సాక్షాత్తు ఆ రాముడు వద్దన్న అంగీకరించలేదు. తండ్రి ఇంటికి వెళ్లమన్నా ససేమిరా అంది. రాముడితో వెళ్లేందుకే సముఖత వహించింది. అంటే ఆమెకు ఏం కావాలనేదానిపై స్పష్టమైన అవగాహన ఉందనడానికి ఇదే నిదర్శనం. అలాగే ఆమె పాత్రలో సంభాషణ అంతగా ఉండదు. నిజానికి ఆమె అర్థం చేసుకునే మనసు కలిగిన సౌమ్యురాలిగానే చూపిస్తారు. 

అయితే ఆ పాత్రలో ఏదైనా మార్చితే బావుండును అని అడిగితే మాత్రం..మాట్లాడాలి, తన వాదన వినిపించాలి, తన కోసం తను నిలబడటం అని చెప్పానంటోంది దీపికా. ఇంకొకటి గమనించాలి సీత అడవిలో ఒంటిరిగా వదిలి వేయబడ్డప్పుడూ..రాముడితో జీవించలేని పరిస్థితి ఎదురైనప్పుడూ..అతడిని నిలదీసిందని గుర్తుచేశారామె. ఆమె తన పిల్లలు లవ, కుశలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి..ఆమె భూమాత ఒడిలోకి వెళ్లి భూజాత అనిపించుకుంది. 

ఇక్కడ సీత రాముడిని నిరంతరం సరిదిద్దుతూ ఉండి ఉంటే..వారి బంధం మరోలా ముగిసి ఉండేదని దీపికా అభిప్రాయపడింది. కొన్ని సార్లు భార్యలకు నిరంతర పర్యవేఓణ అవసరం అని అంటోంది. అంతేగాదు వైవాహిక జీవితంలో ప్రతి మహిళ ప్రతిదానికి తలాడిస్తూ..మౌనంగా ఉండొద్దని కోరుతోంది. ఎందుకంటే అలా ఉంటే..మహిళలను చాలా తేలికగా తీసుకునే ధోరణికి దారితీస్తుందని హెచ్చరిస్తోంది దీపిక.

ఇదీ చదవండి: భూమి ‘దీపావళి పండుగ’..అచ్చం బాణసంచా మాదిరి..!: శుభాంషు శుక్లా

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement