చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది, యాసిడ్‌ బాధితురాలు..! కానీ ఇవాళ ఆమె.. | this single mother adopted a daughter and raising with honesty love and zero apologies | Sakshi
Sakshi News home page

చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది, యాసిడ్‌ బాధితురాలు..! కానీ ఇవాళ ఆమె..

Jul 19 2026 6:24 PM | Updated on Jul 19 2026 6:24 PM

this single mother adopted a daughter and raising with honesty love and zero apologies

జీవితంలో ఎడతెగని సమస్యలు ఎదురైతే..ఎవ్వరికైనా జీవితంపై విసుగు వచ్చేస్తుంది. పుట్టుకతోనే కష్టాలు అనేవి..మనిషిలో ఒక విధమైన నిరాసక్తత పెంచుతుంది. కానీ ఈ అమ్మాయి మాత్రం వాటన్నింటితో మరింత ఉన్నతంగా ఎదిగి..గొప్ప తల్లిగా మారింది. కంటేనే తల్లి కాదు అంటూ 'అ‍మ్మ' అనే పదానికి గొప్ప అర్థం ఇచ్చింది. 

ఆ మహిళే దేవాంశి యాదవ్‌. ఏ బిడ్డ మోయకూడదని వేదనను ఎదుర్కొంది చిన్నతనంలో. తండ్రి ఆమెకు తొమ్మిది నెలల వయసున్నప్పుడే ఉగ్రవాద బాంబు దాడిలో మరణించాడు. ఆమెకు ఆయన ఎలా ఉంటారో కూడా తెలియదు. పోలీసు అధికారి అయిన తల్లి ఆధ్వర్యంలో పెరిగిందామె. పోనీ అక్కడితో ఆ చిన్నారికి కష్టాలు ఆగిపోలేదు. ఆ తర్వాత లైంగిక దాడి, యాసిడ్‌ దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన వారియర్‌ ఆమె. 

ఈ రెండు చేదు అనుభవాలు ఎవ్వరినైనా ఒంటరిగా నిస్తేజంగా మార్చేస్తాయి. కానీ ఆ కష్టాలు ఆమెను మరింత దృఢంగా మార్చాయి. ఎంతలా అంటే తాను తల్లిలా ఒక బిడ్డకు పూర్తి ప్రేమతో కూడిన జీవితం ఇవ్వాలనేంత విశాల హృదయాన్ని అందించే స్థాయికి మార్చింది. టీనేజ్‌లో ఉండగా ఏ అమ్మాయి అయినా..తన తోటి   పిల్లలతో ఎంజాయ్‌​ చేస్తే దేవాంశి మాత్రం తాను జీవసంబంధమైన తల్లిగా కాకుండా దత్తత తల్లిగా ఒక బిడ్డకు మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఆశయంతో పెరిగడం విశేషం. అది నిజం కావడానికి చాలా సమయమే పట్టింది. 

 

ఆ చిన్నారితో నెరవేరిన కల..
ఇరవైలలో దేవాంశి  ఢిల్లీలోని ఒక అనాథాశ్రమంలో బోధిస్తున్నప్పుడు, వినికిడి, మాటల లోపంతో బాధపడుతున్న చిన్నారిని చూసింది. దేవాంశి ఆ చిన్నారిని దత్తత తీసుకోవాలనుకుంది. ఆ సంస్థ అందుకు అనుమతించలేదు. ఆ అనుభవమే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఎందుకంటే తక్షణమే దత్తత తీసుకునేందుకు ప్లాన్‌ చేసుకుని కావల్సిన డాక్యమెంట్లు సిద్దంచేసుకుని కోర్టు అనుమతితో వన్మయిని అనే ఐదు నెలల చిన్నారిని సొంత చేసుకుంది. 

ఆ ఒక్కక్షణంలో ప్రదీది తనకు అపురూపమైనదిగా మారిందని అంటోంది దేవాంశి. ప్రస్తుతం ఆ బిడ్డకు ఏడు సంవత్సరాలు..కానీ ఆమెకు అన్ని తెలిసేలానే పెంచింది. దత్తత, సరోగసి అనేవి ఆ చిన్నారికి తెలుసు. పైగా తన గురించి అభద్రతా భావంతో కాకుండా.. ఎంతగానో ప్రేమించే గొప్ప తల్లితో ఉన్నా అనే భావనతో పెంచింది ఆ చిన్నారిని దేవాంశి. అంతా తనను ఒంటరి తల్లిగా ఎలా పెంచేస్తావని ప్రశ్నిస్తే..వాటికి ఆమె తన చేతల ద్వారా సమాధానిచ్చింది. 

పితృస్వామ్యాన్ని నిశ్శబ్దంగా బద్దలుకొట్టేలా ఆ చిన్నారి అధికారిక పత్రాలన్నింటిలో తన పేరుతో రిజిస్ట్రర్‌ చేసి..ఎంతో సాధించిన విజయంలా అనిపిస్తుందని సగర్వంగా చెబుతోంది దేవాంశి. అంతేగాదు తన తల్లి సైతం ఆ బిడ్డను ఎంతో అపురూపంగా చూస్తుందని చెబుతోంది. ఇక దేవాంశి  లైంగిక హింస, గృహ హింస బాధితులు, బాలల సంక్షేమం కోసం పనిచేసే 'షహీద్ రామశ్రయ వెల్ఫేర్ సొసైటీ' అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు. ఆమె ఒక న్యాయవాది కూడా. 

ఇవన్ని చేస్తూ తల్లిగా బాధ్యతలను కూడా నిర్వర్తిస్తుండటం విశేషం. ఇదేమంతా ఈజీ కాకపోయినా..తన కూతురు తనతోపాటు ఉంటూ..న్యాయవాదం, మానసిక ఆరోగ్యం గురించి పాఠ్యపుస్తకాల ద్వారా కాకుండా తన తల్లి రోజు వారీ ఆచరణ ద్వారా నేర్చుకునేలా చేస్తున్నా అని నవ్వుతూ చెబుతోందామె. ఇది పెంపకానికి, తల్లి అను మాటకు గొప్ప అర్థంలా ఉంది కదా ఆమె స్టోరీ. 

 

(చదవండి: రూ. 38 వేలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి టీ దుకాణం..! ఇప్పుడు ఏకంగా..)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement