రూ. 38 వేలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి టీ దుకాణం..! ఇప్పుడు ఏకంగా.. | Man Quits ₹38,000 Job To Start Tea Stall, Now Earns Nearly ₹1 Lakh Profit A Month, Viral Post Reveals His Success | Sakshi
Sakshi News home page

రూ. 38 వేలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి టీ దుకాణం..! ఇప్పుడు ఏకంగా..

Jul 19 2026 4:28 PM | Updated on Jul 19 2026 5:33 PM

Man quits Rs 38,000 a month job starts tea shop Goes Viral

జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం చేయడానికి చాలామంది భయపడతారు. పెట్టుబడి పెట్టి వ్యాపారం రన్‌ చేశాక..అనుకున్న విధంగా లాభలు రాకపోతే..పరిస్థితి కష్టం కదా అని రిస్క్‌ చేసేందుకు ప్రయత్నించం. కానీ ఈ వ్యక్తి కథ విన్నాక..ట్రై చేస్తే తప్పు లేదు అనే ధైర్యం కలుగుతుంది. అందుకు సంబంధించిన పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. 

ఆ పోస్ట్‌ ప్రకారం..సదరు వ్యక్తి పొరుగున నివశించే వ్యక్తి స్వీట్ల బాక్స్‌తో తన వ్యాపార విస్తరణను సెలబ్రేట్‌ చేసుకోవడానికి రావడంతో ఈ విషయం తెలిసిందంటూ మొదలవుతుంది పోస్ట్‌. ఆ ఎదురింటి వ్యక్తి 'టెలిపెర్ఫార్మెన్స్'లో పనిచేస్తూ నెలకు సుమారు రూ. 38,000 సంపాదించేవాడు. మే నెలలో ఉద్యోగానికి రాజీనామ చేశారు. మరో కార్పొరేట్‌ ఉద్యోగానికి బదులుగా ఆటో స్టాండ్ దగ్గర టీ దుకాణం పెట్టడానికి దాదాపు రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టారు. 

ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, సాధారణ టీని రూ. 10కి, ప్రీమియం టీని రూ. 20కి విక్రయించడం ప్రారంభించారు. అలాగే టీ తయారు చేయడానికి, వినియోగదారులకు అందించడానికి ఇద్దరు మహిళలను నియమించుకున్నారు. ప్రస్తుతం ఆ దుకాణంలో సుమారు 400 కప్పుల టీ అమ్ముడవుతోందని, తద్వారా రోజుకు రూ. 6,000 లేదా నెలకు రూ. 1.8 లక్షల ఆదాయం వస్తోంది. ఒక వేళ ఆ వ్యక్తి పాత ఉద్యోగంలోనే కొనసాగితే..వార్షిక జీతాల పెంపు (appraisals) కోసం ఎదురుచూస్తూ ఇప్పటికీ నెలకు రూ. 38,000 మాత్రమే సంపాదిస్తూ ఉండేవారు. 

అతడికి ఆ వ్యాపారానికి అద్దెకు రూ. 25,000, సిబ్బంది జీతాలకు రూ. 30,000, విద్యుత్‌, ముడి సరుకుల కోసం రూ. 25,000 ఖర్చులను మినహాయించిన తర్వాత కూడా వ్యాపారి నెలకు దాదాపు రూ. 1 లక్ష లాభాన్ని ఆర్జిస్తున్నట్లు సమాచారం. ఆయన వ్యాపారం ఇప్పటికే మరింత వృద్ధి చెందింది. ఆ టీ దుకాణంలో ఇటీవల వడా పావ్, సమోసాలు, జిలేబీలు అందించే కౌంటర్‌ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 ఆ ఎదురింటి వ్యక్తి తనకు స్వీట్ల పంచడంతోనే ఈ విషయం తెలిసిందంటూ పోస్ట్‌లో రాసుకొచ్చాడు సదరు వ్యక్తి. నెటిజన్లు ఆ వ్యక్తి ధైర్యంగా తీసుకున్న రిస్క్‌ను ప్రశంసించడమే కాదు, మధ్యతరగతి వాళ్లకు ఇలా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టే టీ వ్యాపారాలింటివే బెటర్‌..తొలిరోజు తక్కువ అమ్మకాలు వచ్చినా..క్రమంగా పుంజుకుంటుందంటూ పోస్టులు పెట్టారు.

(చదవండి: కాంచీపురం చీరలో దేవతలా సాయిపల్లవి..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement