కాంచీపురం చీరలో దేవతలా సాయిపల్లవి..! | Sai Pallavi Shines Like A Goddess In Kanchivaram Saree At Ramayana Launch Event, Watch Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

కాంచీపురం చీరలో దేవతలా సాయిపల్లవి..!

Jul 19 2026 3:49 PM | Updated on Jul 19 2026 5:18 PM

Fashion: Ramayanas Sai Pallavi Looks Divine In Kanjivaram Saree

ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కాంచీవరం చీరతో సాయిపల్లవి అందరి దృష్టిని ఆకర్షించింది. రామాయణ చిత్ర బృందం, సిబ్బంది ఢిల్లీలో నిర్వహించిన 'ప్రథం సంకల్ప్' అనే మీడియా కార్యక్రమంతో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ ఈవెంట్‌కి రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్, కునాల్ కపూర్, రవిదూబే, కుమార్ విశ్వాస్, అరుణ్ గోవిల్ తదితరులు హాజరయ్యారు. హిందూ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పౌరాణిక పాత్రలు పోషించే అవకాశం గురించి చిత్ర బృందం, నటీనటులు చాలా భావోద్వేగంగా మాట్లాడారు. 

ఆ నేపథ్యంలో సాయిపల్లవి ఇలా కాంచీవరం చీరలో దేవకన్యలా మెరిసింది. ఆమె ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ..నటీనటులకు ఇలాంటి పాత్రలు దక్కడం అంత సులభం కాదు. ఎందుకంటే ఒక దైవ సమానమైన పాత్రను (దేవత పాత్రను) పోషించడం సాధారణ విషయం కాదు. ఆ పాత్రను అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి ఒక బృందం తమ సర్వస్వం ధారపోసి పనిచేయాల్సి ఉంటుంది. రామాయణంలో సీత పాత్రను పోషించాలని ప్లాన్‌ చేసుకోవడం గానీ, ఆశించడం గానీ చేయలేదు. ఈ అవకాశం నాకు ఒక వరంలా లభించింది.  

అందుకే ధ్యానం చేస్తూ..'సీతమ్మా, నా ద్వారా నువ్వే నటించు. నా ద్వారా ఏది వ్యక్తమవుతుందో, అదే ఈ సినిమా కోసం నీకు కావాల్సినది' అని ఆ సీతమ్మ తల్లిని వేడుకున్నా అని భావోద్వేగంగా చెప్పింది సాయిపల్లవి. ఇక ఈ కార్యక్రమం కోసం ఆమె గులాబీ-బంగారు రంగు కాంచీవరం చీరను ఎంచుకున్నారు. ఆ చీరకు అనుగుణంగా బంగారు దేవాలయ ఆభరణాలను ఎంచుకున్నారు. 

అలాగే ఢిల్లీ వాతావరణానికి అనుగుణంగా డ్యూయీ బేస్‌ను ఎంచుకుంది. తన సహజ ఉంగరాల జుట్టును మధ్య పాపిడి తీసి సగం హెయిర్‌డోగా తీర్చిదిద్దుకుంది. కాగా, రూ.4వేల కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన నితేష్‌ తివారీ 'రామాయణం: మొదటి భాగం' 2026 నవంబర్ 8న థియేటర్‌లోకి రానుంది.

 

(చదవండి: పింక్‌ బనారసి పట్టు చీరలో అందమైన గులాబీలా నీతా అంబానీ..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement