breaking news
Kanchivaram sarees
-
కాంచీపురం చీరలో దేవతలా సాయిపల్లవి..!
ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కాంచీవరం చీరతో సాయిపల్లవి అందరి దృష్టిని ఆకర్షించింది. రామాయణ చిత్ర బృందం, సిబ్బంది ఢిల్లీలో నిర్వహించిన 'ప్రథం సంకల్ప్' అనే మీడియా కార్యక్రమంతో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ ఈవెంట్‌కి రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్, కునాల్ కపూర్, రవిదూబే, కుమార్ విశ్వాస్, అరుణ్ గోవిల్ తదితరులు హాజరయ్యారు. హిందూ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పౌరాణిక పాత్రలు పోషించే అవకాశం గురించి చిత్ర బృందం, నటీనటులు చాలా భావోద్వేగంగా మాట్లాడారు. ఆ నేపథ్యంలో సాయిపల్లవి ఇలా కాంచీవరం చీరలో దేవకన్యలా మెరిసింది. ఆమె ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ..నటీనటులకు ఇలాంటి పాత్రలు దక్కడం అంత సులభం కాదు. ఎందుకంటే ఒక దైవ సమానమైన పాత్రను (దేవత పాత్రను) పోషించడం సాధారణ విషయం కాదు. ఆ పాత్రను అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి ఒక బృందం తమ సర్వస్వం ధారపోసి పనిచేయాల్సి ఉంటుంది. రామాయణంలో సీత పాత్రను పోషించాలని ప్లాన్ చేసుకోవడం గానీ, ఆశించడం గానీ చేయలేదు. ఈ అవకాశం నాకు ఒక వరంలా లభించింది. అందుకే ధ్యానం చేస్తూ..'సీతమ్మా, నా ద్వారా నువ్వే నటించు. నా ద్వారా ఏది వ్యక్తమవుతుందో, అదే ఈ సినిమా కోసం నీకు కావాల్సినది' అని ఆ సీతమ్మ తల్లిని వేడుకున్నా అని భావోద్వేగంగా చెప్పింది సాయిపల్లవి. ఇక ఈ కార్యక్రమం కోసం ఆమె గులాబీ-బంగారు రంగు కాంచీవరం చీరను ఎంచుకున్నారు. ఆ చీరకు అనుగుణంగా బంగారు దేవాలయ ఆభరణాలను ఎంచుకున్నారు. అలాగే ఢిల్లీ వాతావరణానికి అనుగుణంగా డ్యూయీ బేస్‌ను ఎంచుకుంది. తన సహజ ఉంగరాల జుట్టును మధ్య పాపిడి తీసి సగం హెయిర్డోగా తీర్చిదిద్దుకుంది. కాగా, రూ.4వేల కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన నితేష్ తివారీ 'రామాయణం: మొదటి భాగం' 2026 నవంబర్ 8న థియేటర్లోకి రానుంది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) (చదవండి: పింక్ బనారసి పట్టు చీరలో అందమైన గులాబీలా నీతా అంబానీ..!) -
సెషెల్స్ ద్వితీయ మహిళకు ప్రధాని మోదీ గిఫ్ట్‌గా కాంచీపురం చీర..! స్పెషాల్టీ ఇదే
ద్వీపదేశమైన సెషల్స్‌లో ప్రధాని మోదీ పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో ఆయన ఆ దేశ స్వర్ణోత్సవ జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరయ్యారు. అక్కడ మోదీకి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మిని ఘన స్వాగతం పలికారు. ఆ సందర్శన నేపథ్యంలో ఆ దేశ ద్వితీయ మహిళ లీనా పిళ్లైకి కాంచీపురం పట్టు చీరను బహుమతిగా అందించారు. ఇది తమిళనాడులో ఉన్న చారిత్రాత్మక దేవాలయ పట్టణమైన కాంచీపురంకి చెందిన ప్రత్యేక చేనేత వస్త్రం. ఇది బౌగోలిక సూచిక(GI) ట్యాగ్‌ను కూడా పొందింది. ఈ సందర్భంగా ఈ పట్టు వస్త్రం ప్రత్యేకత?..ఆ పేరుతో పిలవడానికి రీజన్ ఏంటి? తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.కాంచీపురం పట్టు వస్త్రం భారతదేశంలోని అత్యుత్తమ చేనేత చీరల్లో ఒకటి. ఇది విలాసవంతమైన ఆకృతి, అసాధారణమై పనితనం, ప్రకాశవంతమైన రంగులకు పేరుగాంచింది. ఈ వస్త్ర చరిత్ర చాలా గొప్పది. దీనిని తమిళనాడులోని కాంచీపురం పట్టణంలో నేస్తారు. అత్యంత నాణ్యమైన మల్బరీ పట్టును ఉపయోగించి ఈ పట్టు వస్త్రాన్ని తయారు చేస్తారు. ఈ చేనేత వస్త్రం చూడటానికి అందంగానే కాకుండా మన్నికకు కూడా ప్రసిద్ధి చెందింది. వాటిపై ఉండే జరీ నమునా, విభిన్న రంగులు దాని ఖరీదును, ప్రత్యేకతను నిర్దేశిస్తాయి. ఈ చీరల తయారీలో ఎక్కువగా దేవాలయ వాస్తుశిల్పం, పువ్వులు, నెమళ్లు, ఆకులు వంటి జ్యామితీయ నమునాలు ఉంటాయి. ఈ చీరలో ఉన్న ప్రత్యేకత దానికి సమకాలీనంగా ఉండే బ్లౌజు. ఇది ఆ చీరను మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. భారీగా ఎంబ్రాయిడీ చేసిన బ్లౌజుకి బదులుగా సాంప్రదాయ కాంచీపురం హాల్టర్ నెక్ బ్లౌజ్ లేదా ఫుల్‌స్లీవ్ సిల్హౌట్‌లు ఈ చీర లుక్‌ని మరింత పెంచేస్తుంది. ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్లు చీరగానే కాకుండా రకరకాలు డిజైనర్వేరల్లోకి తీసుకొస్తుండటం విశేషం. అంతేగాదు వెస్ట్‌కోట్‌లు, షర్టులు, కో-ఆర్డ్ సెట్లు లేదా న్యూట్రల్ బేసిక్స్‌తో జత చేసి సరికొత్త ట్రెండ్‌ని సృష్టిస్తున్నారు కూడా. ఈ కాంచీపురం పట్టుని ఆధునిక శైలిలో ధరించినా లేదా సాంప్రదాయ స్ఫూర్తిని గౌరవించినా..దాని వారసత్వం, చరిత్ర, సంస్కృతిని ఇనుమడింప చేసేలా ఆకర్షణీయంగా కనిపించడం దీని ప్రత్యేకత. ఇక్కడ మోదీ సెషెల్స్ ద్వితీయ మహిళకు ఈ కాంచీపురం వస్త్రాన్ని గిఫ్ట్‌గా ఇవ్వడానికి కారణం కూడా ఇదే. కొన్ని వస్త్రాలు ఎప్పటికీ ఫ్యాషన్ నుంచి తప్పుకోవని, వాటిని ధరించడానికి రకరకాల మార్గాలు దొరుకుతాయని నొక్కి చెప్పేందుకే. View this post on Instagram A post shared by New India Junction (@nijunction) వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి(చదవండి: స్లిమ్‌గా ఉపాసన కొణిదెల..! ట్విన్స్ తర్వాత బరువు తగ్గాలంటే..) -
'అందుకే అంత బాధగా ఉంది..'
చేతి నిండా సినిమాలున్నా, ఎన్నో అవకాశాలు తలుపు తడుతున్నా బాలీవుడ్ పరిణీత విద్యాబాలన్‌కు మాత్రం చేజారిన ఓ అవకాశం మీదకే మనసు మళ్లుతోందట. ఎలాగైనా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కితే బావుండని ఫీల్ అవుతోంది. విద్య మనసు దోచిన ఆ పాత్ర ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయనీమణి అయిన ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మి జీవితచరిత్ర ఆధారంగా నిర్మించదలచిన చిత్రంలో లీడ్ రోల్. ఎమ్ఎస్ సుబ్బులక్ష్మిగా విద్యా దాదాపు ఫిక్సయ్యాక అనుకోని అవాంతరాలతో ఆ సినిమా నిర్మాణం ఆగిపోయింది. దాంతో విద్య మనసు మనసులో లేకుండా పోయింది. ఎలాగైనా సినిమా తిరిగి మొదలైతే బావుండని కోరుకుంటోంది. అయితే ఆమె ఆ పాత్రలో నటించాలని అంతగా కోరుకోవడం వెనుక చాలా కారణాలున్నాయట. వాటిలో ఒకటి.. సుబ్బులక్ష్మి ఆహార్యం. ఆమె ధరించే అందమైన చీరలు, నగలంటే విద్యకు చాలా ఇష్టమట. ముఖ్యంగా సుబ్బులక్ష్మి ధరించే వజ్రాల చెవిదిద్దులు చాలామందిని ఆకర్షించేవన్నారు. ఇప్పటికీ ఆమె ఫొటోలు చూసినప్పుడల్లా ఆమె ధరించిన నగలు చూసి 'ఓ మై గాడ్' అనుకునేవాళ్లు చాలామందే ఉన్నారన్నారు. కాంచీవరం చీరల్లో, వజ్రాల నగలతో ఆమెలా అందంగా కనిపించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఫీలయ్యానని, కానీ అనుకోని కారణాలతో సినిమా నిర్మాణం ఆగిపోవడం చాలా బాధగా ఉందన్నారు. అయితే కనీసం తన మనసులోని మాట బయట పెట్టినందుకైనా ఎవరైనా సినిమా మొత్తం కాంచీవరం చీరలతో కనిపించేలా ఓ మంచి కథతో ముందుకొస్తే బావుండంటున్నారు. విద్యా బాలన్ చాలాసార్లు తనకు నగలు, చీరల మీదున్న ఇష్టాన్ని బయటపెట్టింది. ఆభరణాలు కొనడమనేది తనకి తెలిసిన మంచి ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెబుతుంటుంది. అందమైన చీరల్లో ఎక్కువగా టెంపుల్ జ్యూయెలరీని ధరించి కనిపిస్తుంటుంది విద్య. ప్రస్తుతం ఆమె 'బేగమ్ జాన్' అనే సినిమాలో నటిస్తుంది. అలాగే మహానటి సావిత్రి పాత్రలో నటించేందుకు టాలీవుడ్ యువ దర్శకుడు విద్యను సంప్రదించినట్టు సమాచారం.


