యాదగిరిగుట్ట ఆలయ వేళల్లో మార్పులు | Yadagirigutta temple timings changes on Diwali full details | Sakshi
Sakshi News home page

దీపావళిన యాదగిరిగుట్ట ఆలయ వేళల్లో మార్పులు

Nov 7 2026 2:37 PM | Updated on Nov 7 2026 2:40 PM

Yadagirigutta temple timings changes on Diwali full details

యాదగిరిగుట్ట: దీపావళిని పురస్కరించుకొని ఈనెల 8న యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వేళల్లో మార్పులు చేసినట్లు ఈవో భవానీశంకర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం వేకువ జామున ఉదయం 3.30 గంటలకు ఆలయాన్ని తెరచి 4 గంటల వరకు సుప్రభాతం నిర్వహిస్తామన్నారు. 4 గంటల నుంచి 4.45 గంటల వరకు శ్రీస్వామి వారికి మంగళహారతులు ఇస్తారని, 4.45 గంటల నుంచి 5.45 గంటల వరకు తిరువారాధన, బాల బోగం, ఆరగింపు చేపడతారని వెల్లడించారు.

ఉదయం 5.45 గంటల నుంచి 6.45 గంటల వరకు నిజాభిషేకం జరిపిస్తారన్నారు. 6.45 నుంచి 7.15 గంటల వరకు సహస్రనామార్చన ఉంటుంది. 7.15 గంటల నుంచి భక్తులకు ఉభయ దర్శనాలు, శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, ఆలయ పూజ కార్యక్రమాలు యథావిధిగా జరిపిస్తామని ఈవో వెల్లడించారు. దీపావళి రోజు ఉదయం వేళ ఆలయ నిత్య కైంకర్యాల సమయాల్లో మార్పులు చేయడంతో పాటు భక్తులకు కల్పించే శ్రీస్వామి వారి సుప్రభాత టికెట్లు రద్దు చేశామని తెలిపారు. 

ఇదీ చ‌ద‌వండి: విడదీసినోళ్లే ఒడి చేర్చారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement