కొడుకు బతికి ఉండగానే శ్మశానానికి.. | Vemulawada Rakesh Incident Rajanna Sircilla | Sakshi
Sakshi News home page

కొడుకు బతికి ఉండగానే శ్మశానానికి..

Nov 7 2026 9:18 AM | Updated on Nov 7 2026 9:27 AM

Vemulawada Rakesh Incident Rajanna Sircilla

వైకుంఠధామంలో రాకేశ్‌తో ఉన్న తల్లి అమృత

వేములవాడ(రాజన్న సిరిసిల్ల జిల్లా): కొడుకు బతికుండగానే శ్మశానికి తీసుకెళ్లడంతో ఆ తల్లిగుండె తల్లడిల్లింది. అనారోగ్య సమస్యతో కొన ఊపిరితో ఉన్న కొ డుకును చూసి ఆ తల్లి వేదన అంతులేనిది అయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ స్పందించారు. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు.  రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన మర్రిపల్లి అమృతకు ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు నిజామాబాద్‌లో ఉంటుండగా, మరో కొడుకు రాకేశ్‌తో కలిసి ఐదేళ్లుగా వేములవాడలోని అద్దె ఇంట్లో ఉంటున్నారు.

 రాకేశ్‌ కొద్ది రోజులుగా కాలేయ సంబంధిత అ నారోగ్యంతో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో గురువారం వేములవాడ ప్రభుత్వ ఏరి యా ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడికి వెళ్లలేని పరిస్థితుల్లో అద్దె ఇంటికి తిరిగొచ్చారు. కొన ఊపిరితోఉన్న రాకేశ్‌ను చూసిన అద్దె ఇంటి యజమాని అభ్యంతరం తెలపడంతో ఏమి చేయలేని పరిస్థితిలో శుక్రవారం తెల్లవారుజామున వేములవాడలోని వైకుంఠధామానికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ చలించిపోయారు. 


 సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించిన చైర్మన్‌ రాజు 

బాధితులకు అండగా నిలవాలని మున్సిపల్‌ పాలకవర్గానికి సూచించారు. వెంటనే మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, కమిషనర్‌ లోకేశ్‌ వైకుంఠధామానికి చేరుకొని.. 108 అంబులెన్స్‌లో రాకేశ్‌ను సిరిసిల్ల జనరల్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. రాకేశ్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మున్సిపల్‌ చైర్మన్‌ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సూచనలతో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు రాకేశ్‌ ఐసీయూలో చేర్చి.. మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నరాల శేఖర్, కౌన్సిలర్‌ కొండ రాజశేఖర్, నాయకులు మూడపల్లి నాగరాజు తదితరులు ఉన్నారు.    

 

 

ఇదీ చదవండి: ఎయిర్‌టెల్‌ రూ.299 ప్లాన్‌ రీఎంట్రీ


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement