భార్యను హత్య చేసిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ | AR Constable Wife Incident | Sakshi
Sakshi News home page

భార్యను హత్య చేసిన ఏఆర్‌ కానిస్టేబుల్‌

Nov 7 2026 11:16 AM | Updated on Nov 7 2026 11:29 AM

AR Constable Wife Incident

హనుమకొండ జిల్లా: ప్రేమించి పెళ్లాడిన భర్తే కాలయముడిగా మారాడు. అనుమానం పెనుభూతంగా మారడంతో పోలీసు కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి భార్యను హత్య చేసి ఆనవాళ్లు దొరకకుండా సంచిలో మూటగట్టి గోదావరిలో విసిరేసిన ఘటన ఇది. ఇందుకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం త్రీటౌన్, బూర్గంపాడు పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. 

ఇన్‌స్టాలో పరిచయం..
భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన నరేందర్‌ కొత్తగూడెంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండేళ్ల క్రితం ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన భవాని(30)తో పరిచయం ఏర్పడగా వేర్వేరు కులాలు కావడంతో పెళ్లికి ఇరువురి కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో ఆలయంలో ప్రేమవివాహం చేసుకున్నాక కొత్తగూడెం ప్రగతినగర్‌లో కాపురం పెట్టారు. భవానికి తొలి సంతానంగా జన్మించిన శిశువు కొద్ది రోజులకే అనారోగ్యంతో మృతి చెందింది. ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. అయితే, ఆమెకు గతంలో ఇతరులతో పరిచయం ఉందంటూ నరేందర్‌ అనుమానం పెంచుకోగా, ఇటీవల ఇన్‌స్టాలో ఇంకొందరితో చాటింగ్‌ చేస్తోందని గొడవ పడినట్లు తెలిసింది. 

ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ విబేధాలు తలెత్తడంతో 3వ తేదీన రాత్రి ఘర్షణ పడడంతో ఇంట్లోనే ఆమెను హత్య చేసిన నరేందర్‌ తన స్వగ్రామం వెళ్లిపోయాడు. అక్కడ తన కుటుంబీకులకు విషయం చెప్పి ఒకరిని తీసుకుని కొత్తగూడెం వచ్చి భవాని మృతదేహాన్ని మూటగట్టి 4వ తేదీన రాత్రి వాహనంలో తీసుకెళ్లి భద్రాచలం బ్రిడ్జి పైనుంచి గోదావరి నదిలో విసిరేశాడు. అప్పటికే భవాని కుటుంబ సభ్యులు ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారిస్తున్నారు. ఇంతలోనే నరేందర్‌ శుక్రవారం పోలీసులకు లొంగిపోగా హత్య సంఘటన వెలుగులోకి వచ్చింది. 

బూర్గంపాడు సమీపాన మృతదేహం
భవానిని నరేందర్‌ హత్య చేసినట్లు అంగీకరించి పోలీసులకు లొంగిపోవడంతో గాలింపు మొదలుపెట్టారు. కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు పోలీసులు శుక్రవారం ఉదయం నుంచి గజ ఈతగాళ్లతో నదిలో గాలించి బూర్గంపాడు సమీపాన మృతదేహాన్ని గుర్తించారు. ఆ తర్వాత భద్రాచలం ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, పలు స్టేషన్ల సీఐలు ఇంద్రసేనారెడ్డి, యాసిన్, జితేందర్‌ గాలింపును పర్యవేక్షించారు. కాగా, మృతదేహం తరలింపులో నరేందర్‌కు ఎవరు సహకరించారు, అందులో కుటుంబీకులే ఉన్నారా.. భార్యను ఆయన ఎలా హత్య చేశాడన్న తదితర వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: కొడుకు బతికి ఉండగానే శ్మశానానికి..


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement