సహాన(ఫైల్) రాహుల్(ఫైల్)
వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు బలిగొంది. భర్తతో గొడవపడిన వివాహిత ప్రియుడితో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తాలూకాలోని ఇండువాల్ సమీపంలో రైల్వే ట్రాక్‌ల వద్ద జరిగింది. మండ్య తాలూకా గున్నైకనహళ్లి గ్రామానికి చెందిన సహాన(27) బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండేది.
ఆ సమయంలో, పావగడ సమీపంలోని అరసికెరె నివాసి, బెంగళూరులో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న వీరేశ్‌తో ప్రేమలో పడి, వివాహం చేసుకుంది. దంపతులు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. వీరికి ఐదు సంవత్సరాల కుమార్తె, రెండు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. కాగా రాపిడ్ బైకర్ రాహుల్‌తో సహానకు పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది.
ఈ విషయం భర్త వీరేశ్‌కు తెలియడంతో మందలించాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో రాహుల్‌తో కలిసి మండ్యకు చేరిన సహన... తాలూకాలోని ఇండువాల్ సమీపంలో హైవే సర్వీస్ రోడ్డు పనులు జరుగుతున్న ప్రదేశం వద్ద శుక్రవారం తెల్లవారుజామున సుమారు 1.50 గంటల సమయంలో మైసూరు–బెంగళూరు ప్యాసింజర్ రైలు కింద దూకి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు మృతదేహాలను పరిశీలించి మిమ్స్ మార్చురీకి తరలించారు.కేసు దర్యాప్తులో ఉంది.
-కర్ణాటక
ఇదీ చదవండి: క్లబ్‌లో మభ్యపెట్టి..హోటల్‌లో అత్యాచారం


