ఇల్లినాయ్ సెనేటర్‌గా నబీలా సయ్యద్ ఎన్నిక
తల్లిదండ్రులు హైదరాబాదీలు
షికాగో (ఇల్లినాయ్): మన హైదరాబాదీ వారసత్వమున్న ముస్లిం మహిళ నబీలా సయ్యద్ అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఇల్లినాయ్ సెనేట్‌కు ఎన్నికై సరికొత్త రికార్డు సృష్టించారు. అమెరికా మిడ్‌వెస్ట్ రాజకీయాల్లో అత్యంత ప్రతిభావంతులైన యువ నాయకురాలిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి అమెరికాకు వలస వచ్చిన దంపతులకు షికాగోలోని పాలటైన్ ప్రాంతంలో పుట్టిన నబీలా 2022 నవంబరులో ఇల్లినాయ్‌స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ (51వ డిస్ట్రిక్ట్) సీటుకు పోటీ చేసి, రిపబ్లికన్ సిట్టింగ్ అభ్యర్థి క్రిస్ బోస్‌పై విజయం సాధించి జాతీయ స్థాయి వార్తల్లో నిలిచారు.
కేవలం 23 ఏళ్ల వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టి.. ఇల్లినాయ్ అసెంబ్లీకి ఎన్నికైన అత్యంత పిన్న వయసు్కరాలిగా, తొలి భారతీయ అమెరికన్‌గా సరికొత్త చరిత్ర సృష్టించారు. హౌస్ ప్రతినిధిగా మెరుగైన వైద్య సేవలు, విద్య సంస్కరణలు, ప్రజలకు ఉపయోగపడే సదుపాయాలకు సంబంధించిన కమిటీల్లో పనిచేసి ఆచరణాత్మక విధానాలను రూపొందించిన ప్రజా ప్రతినిధిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2026లో డిస్ట్రిక్ట్ 26 నుంచి ఇల్లినాయ్‌స్ స్టేట్ సెనేట్‌కు పోటీ చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డార్బీ హిల్స్‌పై ఘన విజయం సాధించారు.
నబీలాకు 57 శాతం ఓట్లు దక్కగా డార్బీ హిల్స్ 43 శాతం ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నబీలా ప్రజా జీవితం ఒక రకంగా హైసూ్కలు నుంచే ప్రారంభమైందని చెప్పాలి. అప్పట్లోనే ఆమె వలసదారులపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకునే విషయంలో అందరి తరఫున నిలబడాలన్న ఆలోచన ఉండేది. ఇదే ఆలోచనతో 2022 లోనూ నబీలా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. కమ్యూనిటీకి కొత్త గొంతుకగా నిలుస్తానని హామీ ఇచ్చి ఎన్నికల్లో విజయం సాధించారు.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బర్కిలీ) నుంచి పొలిటికల్ సైన్స్, బిజినెస్ అడ్మిని్రస్టేషన్ విద్యనభ్యసించిన నబీలా అనంతరం, పాలటైన్ తిరిగి వచ్చారు. స్వచ్ఛంద సంస్థల్లో డిజిటల్ స్ట్రాటజిస్ట్‌గా పనిచేశారు. ఆ తర్వాత నేరుగా రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తాజా ఎన్నికల్లో వైద్యసేవలను సులభతరం చేయడం, ఉపాధి అవకాశాలు పెంచడం, ఏఐ డేటా సెంటర్ల నియంత్రణ వంటి అంశాలను తన అజెండాగా మార్చుకున్నారు. 2027 జనవరిలో ప్రమాణ స్వీకారం చేయనున్న నబీలా వయసు ఇప్పుడు 27 ఏళ్లు మాత్రమే!


