సివిల్‌ ఇంజనీరింగ్‌లో సరికొత్త ఆవిష్కరణల దిశగా... | RIDES 2026 Conference in Hyderabad Details | Sakshi
Sakshi News home page

RIDES 2026: న‌వంబ‌ర్‌ 26, 27న రైడ్స్‌ జాతీయ సదస్సు

Nov 5 2026 5:19 PM | Updated on Nov 5 2026 5:25 PM

RIDES 2026 Conference in Hyderabad Details

హైద‌రాబాద్‌: సివిల్‌ ఇంజనీరింగ్‌ రంగంలో ఆధునిక సాంకేతికత, వినూత్న ఆవిష్కరణలు, స్థిరమైన నిర్మాణ పద్ధతులను ప్రోత్సహించే లక్ష్యంతో రైడ్స్‌–2026 (RIDES 2026) జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో సదస్సు బ్రోచర్‌ను ఆవిష్కరించారు.

అసోసియేషన్‌ ఆఫ్‌ కన్సల్టింగ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌ (ఇండియా) హైదరాబాద్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియాలో సదస్సుతోపాటు బిల్డ్‌–టెక్‌ ఎక్స్‌పో–2026 జరగనుంది. దేశ, విదేశాలకు చెందిన  వెయ్యి మందికిపైగా సివిల్‌ ఇంజనీర్లు, స్ట్రక్చరల్‌ ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

నిర్మాణ రంగ సవాళ్లు,  సదుపాయాల అభివృద్ధి, ఆధునిక ఇంజనీరింగ్‌ పరిష్కారాలపై నిపుణులు అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఏసీసీఈ(ఐ) హైదరాబాద్‌ సెంటర్‌ చైర్మన్‌గా భీమ్‌రావు జలిగామ, ఆర్గనైజింగ్‌ చైర్మన్‌గా రాజ్‌కుమార్, సెక్రటరీ జనరల్‌ అడెపు కాశీరాం వ్యవహరించనున్నారు. ఆర్గనైజింగ్‌ కో–చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి, సెక్రటరీగా రమేష్, ట్రెజరర్‌గా రుద్ర అమర్నాథ్‌బాబు, మీడియా కన్వీనర్‌గా అక్కుల సుధాకర్‌ బాధ్యతలు చేపట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement