దీపావళిని పురస్కరించుకొని నాట్స్ (నార్త్ అమెరికా తెలుగు సొసైటీ) తెలంగాణ,అమెరికాలో సేవా కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించిందని అధ్యక్షుడు రాజ్ అల్లాడ, ఛైర్మన్ కిషక్షర్ కంచర్ల తెలిపారు. ఘట్‌కేసర్ మండలం మేడిపల్లి గ్రామంలో మాతృ అభయ ఫౌండేషన్‌కు ప్రముఖ యాంకర్, నటి సుమ నిర్వహిస్తున్న ఫెస్టివల్ ఫర్ జాయ్స్ కార్యక్రమంలో భాగంగా రూ. 3 లక్షల సామాగ్రిని అందజేశారు. అంతేకాకుండా న్యూజెర్సీ, మిస్సోరి, డల్లాస్, మిచిగాన్, టంపాలో ఉచిత వైద్యశిబిరాలు, పలు సాంసృతిక కార్యక్రమాలను కోఆర్డినేటర్లు కిరణ్ నారే, పావని నున్నా, సౌజన్య రావెళ్ల, కృష్ణ కిషోర్, శ్రీదేవి మానేపల్లి ఆధ్వర్యంలో నిర్వహించారు.


