పంజగుట్ట: స్పా ముసుగులో వ్యభిచార గృహం | Illegal Activities in Spa Centres at Hyderabad | Sakshi
Sakshi News home page

పంజగుట్ట: స్పా ముసుగులో వ్యభిచార గృహం

Nov 5 2026 12:58 PM | Updated on Nov 5 2026 12:58 PM

Illegal Activities in Spa Centres at Hyderabad

హైదరాబాద్‌: బ్యూటీ సెలూన్, స్పా ముసుగులో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న వారిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఒక బాధిత మహిళకు విముక్తి కల్పించడంతో పాటు ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. సన్నెబోయిన నాగమణి పంజగుట్ట నాగార్జున సర్కిల్‌ సమీపంలో ఓ ఫ్లాట్‌ అద్దెకు తీసుకుంది. అక్కడ స్పా కేంద్రాన్ని ఏర్పాటు చేసి చేసింది. మసాజ్‌ సేవల కోసం మహిళలకు నెలవారీ జీతం ఆశ చూపి పనిలోకి తీసుకుంది. 

అనంతరం వారిని బెదిరించి బలవంతంగా వ్యభిచారంలోకి దింపింది. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం రాత్రి 11 గంటలకు ఇన్‌స్పెక్టర్‌ ఈ.జహంగీర్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో పోలీసులు స్పాపై దాడి చేశారు. ప్రధాన నిర్వాహకురాలు నాగమణిని అరెస్టు చేసి నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. బాధిత మహిళను రెస్క్యూ హోమ్‌కు పంపించారు. ఇద్దరు విటులకు నోటీసులు జారీ చేశారు.   

ఇదీ చదవండి: భర్త ఆదాయం రూ.40 లక్షలైనా.. భార్యకు భరణం నో!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement