తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం! | Blood donation camp organized by the Telangana Cultural Society Singapore | Sakshi
Sakshi News home page

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం!

Nov 2 2026 11:57 AM | Updated on Nov 2 2026 12:00 PM

Blood donation camp organized by the Telangana Cultural Society Singapore

సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ఆదివారం Bloodbank@ One Punggol లో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది.  ఈ శిబిరంలో దాదాపు 50 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అవసరమైన వారికి రక్తాన్ని అందించాలనే లక్ష్యంతో TCSS ఈ శిబిరాన్ని నిర్వహించింది.

ఈ సందర్భంగా పలువురు రక్తదాతలు మాట్లాడుతూ,TCSS నిర్వహించిన రక్తదాన శిబిరంలో భాగస్వాములవడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా  TCSSకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలాంటి సేవా కార్యక్రమాలను TCSS నిరంతరం కొనసాగించాలని, మరింతమంది రక్తదాతలు ముందుకు రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన నిర్వాహకులు, స్వచ్ఛంద కార్యకర్తలకు వారు అభినందనలు తెలిపారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రక్తదాతలకు, సహకరించిన వాలంటీర్లకు, మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ , శిబిరానికి సహకరించిన సింగపూర్ హెల్త్ సైన్సెస్ అథారిటీ (HSA) సిబ్బందికి సొసైటీ అధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు, విక్రమ్ చిట్ల, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు, శివ ప్రసాద్ ఆవుల, కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా కృష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్, యసరావేణి విజయ కుమార్, మల్లారెడ్డి కల్లెం, సుకేందర్ నీలం తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.

 మరిన్ని  NRI వార్తల కోసం ఇక్కడ  క్లిక్‌ చేయండి! 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement