భార‌తీయుడికి షాక్ ఇచ్చిన ఇంగ్లండ్‌ రాజు | King Charles strips British Indian landlord Nirpal Singh Riat of OBE | Sakshi
Sakshi News home page

‘భారతీయుని’ గౌరవం వెనక్కు

Oct 23 2026 7:27 PM | Updated on Oct 23 2026 7:40 PM

King Charles strips British Indian landlord Nirpal Singh Riat of OBE

లండన్‌: అద్దె ఇళ్ల వివాదంలో అప్రతిష్టపాలైన భారత మూలాలున్న బ్రిటిష్‌ వ్యాపారవేత్త నిర్పాల్‌సింగ్‌ రియాట్‌(70) ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటిష్‌ ఎంపైర్‌ (ఓబీఈ) గౌరవ పురస్కారాన్ని కోల్పోయారు. దాన్ని రద్దు చేస్తూ ఇంగ్లండ్‌ రాజు చార్లెస్‌–3 తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఆయన వ్యవహార శైలి గౌరవ పురస్కారాల వ్యవస్థకే అపకీర్తి తెచ్చిపెట్టిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో ఆక్షేపించింది.

రియాట్‌ తన ఇళ్లను అక్రమంగా ఫ్లాట్లుగా మార్చడమే గాక వాటిని అత్యంత అపరిశుభ్ర పరిస్థితుల్లో నిరుపేదలకు అద్దెకిచ్చినట్టు స్థానిక మీడియా పేర్కొంది. మూడేళ్ల క్రితం కూడా ఇలాంటి ఉదంతంలో ఆయనకు రూ.3.8 కోట్ల దాకా జరిమానా పడ్డట్టు వెల్లడించింది. రాజు నిర్ణయాన్ని రియాట్‌ కోర్టులో సవాలు చేశారు. పంజాబీలకు రియాట్‌ చేసిన సేవలకు గుర్తింపుగా 2010లో నాటి రాణి ఎలిజబెత్‌–2 ఆయనకు ఓబీఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

‘భారత’ ఫార్మసిస్టుకు జైలు
లండన్‌: ఇంగ్లండ్‌లో నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌) ప్రిస్క్రిప్షన్‌ కేసులో భారత మూలాలున్న జిగ్నేశ్‌ పటేల్‌ (46) అనే ఫార్మసిస్టుతో పాటు ఆయన దగ్గర పని చేసే రాహిల్‌ పటేల్‌ (42) అనే వ్యక్తికి ఆరేళ్ల జైలు శిక్ష పడింది. జిగ్నేశ్‌ ఉత్తర లండన్‌లో వైజ్‌ ఫార్మసీతో పాటు యాక్టీఫామ్‌ లిమిటెడ్‌ పేరిట ఫార్మా వ్యాపార సంస్థను నడుపుతున్నాడు.

ఇదీ చ‌ద‌వండి: భారతీయులకు చైనా వీసా ప్రక్రియలో మార్పులు

అతను స్ప్రైసెల్, నోక్సాఫిల్, ఆర్టిప్లా, ఎవిప్లెరా, టోబ్రామైసిన్, ట్రువడా, వైరీడ్‌ వంటి ఖరీదైన ఔషధాలను నకిలీ ప్రిస్క్రిప్షన్ల సాయంతో సేకరించి వాటిని యూరోపియన్‌ ఫార్మా కంపెనీలకు టోకున అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్టు ఎన్‌హెచ్‌ఎస్‌ కౌంటర్‌ ఫ్రాడ్‌ అథారిటీ తేల్చింది. తద్వారా 2015 నుంచి రెండేళ్ల పాటు కనీసం 13 లక్షల పౌండ్ల మేరకు మోసానికి పాల్పడ్డట్టు పేర్కొంది. ఆ మొత్తాన్ని జిగ్నేశ్‌ నుంచి రాబట్టేందుకు చర్యలు తీసుకోనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement