మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై.. ఇరాన్‌ దౌత్యవేత్త కీలక వ్యాఖ్యలు | abdul majid hakeem elahi at ndtv world summit why healthy mojtaba khamenei | Sakshi
Sakshi News home page

మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై.. ఇరాన్‌ దౌత్యవేత్త కీలక వ్యాఖ్యలు

Oct 23 2026 2:59 PM | Updated on Oct 23 2026 3:17 PM

abdul majid hakeem elahi at ndtv world summit why healthy mojtaba khamenei

పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమై ఎనిమిది నెలలు గడుస్తోన్నా యుద్ధం విషయంలో ఒక స్పష్టమైన ముగింపు రాలేదు. అయితే యుద్ధం విషయం అలా ఉంచితే మరో ముఖ్యమైన విషయం ఆ దేశ సుప్రీంలీడర్‌ మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యం విషయం అసలు ఆయన ప్రాణాలతోనే లేరని అమెరికా దాడుల్లో మరణించారని పెద్దఎత్తున పుకార్లు చెలరేగాయి.. మరోవైపు ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఇరాన్‌ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఖమేనీ ఆరోగ్యంపై ఇరాన్‌ సీనియర్ దౌత్యవేత్త కీలక విషయాలు వెల్లడించారు.

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై నెలకొన్న అనుమానాల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, తన విధులను సమర్థంగా నిర్వహిస్తున్నారని ఇరాన్‌కు చెందిన సీనియర్ దౌత్యవేత్త అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ వెల్లడించారు. ఇటీవలే ఇరాన్ అధ్యక్షుడితో ఆయన ఏడు గంటల పాటు సమావేశమయ్యారని తెలిపారు. అయితే, మొజ్తబా ఖమేనీ ఇప్పటికీ బహిరంగంగా కనిపించకపోవడానికి భద్రతాపరమైన కారణాలే ప్రధానమని పేర్కొన్నారు.

ఇరాన్ అధ్యక్షుడితో సమావేశం 
మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై వస్తున్న సందేహాలను ఖండిస్తూ ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి, సీనియర్ దౌత్యవేత్త అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ ఎన్‌డీటీవీతో మాట్లాడారు. “ఆయన ఆరోగ్యం చాలా బాగుంది. ఎంతో చురుగ్గా పనిచేస్తున్నారు. గత వారమే ఆయన ఇరాన్ అధ్యక్షుడితో ఏడు గంటల పాటు సమావేశమయ్యారు. పార్లమెంట్ స్పీకర్ కూడా ఎల్లుండి ఇక్కడికి రానున్నారు. నిన్న ఆయన కూడా మొజ్తబా ఖమేనీని చాలా గంటల పాటు కలిసినట్లు చెప్పారు. మొజ్తబాను కలిసిన నా స్నేహితులు కూడా ఆయన చాలా చాలా ఆరోగ్యంగా ఉన్నారని, తన విధులను చక్కగా నిర్వహిస్తున్నారని నాకు హామీ ఇచ్చారు” అని ఇలాహీ వెల్లడించారు.

తండ్రి అంత్యక్రియలకు మొజ్తబా హాజరయ్యారా?
మొజ్తబా ఖమేనీ తన తండ్రి అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కాలేదనే ప్రచారాన్ని కూడా ఇరాన్ దౌత్యవేత్త ఖండించారు. అంత్యక్రియల సమయంలో తాను ఇరాన్‌లోనే ఉన్నానని, మొజ్తబా అక్కడికి వచ్చారని తెలిపారు.

“భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా ఆయన మీడియా ముందుకు రావడం లేదు. అందుకే ఎవరూ ఆయనను బహిరంగంగా చూడలేకపోయారు. అయితే, ఆయన తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనలేదనడం సరికాదు. ఆ సమయంలో నేను ఇరాన్‌లోనే ఉన్నాను. ఆయన ఇద్దరు సోదరులను కలిశాను. మొజ్తబా ఖమేనీ కూడా అక్కడే ఉన్నారు” అని ఇలాహీ పేర్కొన్నారు.

అంతేకాకుండా, కొన్ని రాత్రుల్లో మొజ్తబా బయట వీధుల్లోకి కూడా వస్తారని, ఇరాన్‌లో ప్రజలు నిర్వహించిన ప్రదర్శనల్లో పాల్గొన్నారని ఆయన చెప్పారు. మొజ్తబా తన విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని మరోసారి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: మాల్దీవులు డబుల్ గేమ్‌

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement