కన్నతల్లి చేతిలో చిన్నారి హత్య : కన్నీరుమున్నీరవుతున్న తండ్రి | I Lost My World Indian Origin Man On Daughter Killed By Wife In New York | Sakshi
Sakshi News home page

కన్నతల్లి చేతిలో చిన్నారి హత్య : కన్నీరుమున్నీరవుతున్న తండ్రి

Oct 21 2026 3:26 PM | Updated on Oct 21 2026 4:29 PM

 I Lost My World Indian Origin Man On Daughter Killed By Wife In New York

న్యూయూర్క్‌లోని క్వీన్స్ (Queens) లోని రిచ్‌మండ్ హిల్లూ ప్రాంతంలో ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం ఫ్రాన్సిస్ కెబెల్లో (32)అనే మహిళ పోలీసులకు ఫోన్‌ చేసి, " నా కూతుర్ని చంపేశాను" అని చెప్పిన ఘటన దిగ్బ్రాంతి రేపింది. అందరితో కలివిడిగా ఉండే ఫాబియానా కాబెల్లో అనే చిన్నారి మృతిని కుటుంబసభ్యులు  జీర్ణించుకోలేకపోతున్నారు. నా సర్వస్వం కోల్పోయాను అంటూ తండ్రి కన్నీరుమున్నీరవుతున్నారు.

అసలేం జరిగిందంటే.. ది న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం 32 ఏళ్ల ఫ్రాన్సిస్ కాబెల్లో, "నేను నా కూతురిని చంపేశాను" అని పోలీసులకు చెప్పింది. నిజానికి ఫ్రాన్సిస్ కెబెల్లో  తన బిడ్డ ‘ఫాబియానా’ ను ఎంతో అపురూరంగా  చాలా భద్రంగా చూసుకునేది.  పోలీసులు ఆమె ఇంటికి చేరుకునేసరికి ఐదేళ్ల చిన్నారి ఫాబియానా కెబెల్లో అపస్మారక స్థితిలోముక్కు నుండి రక్తం కారుతుండగా గమనించారు.వెంటనే ఆమెను జమైకా హాస్పిటల్ మెడికల్ సెంటర్‌కు తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే భర్త  కుల్దీప్‌ సింగ్‌ పోలీసులకు అందించిన సమాచారం ప్రకారం  ఫ్రాన్సిస్ కెబెల్లో గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతోంది. ప్రవర్తన  కూడా వింతగా  ఉండేది. ఆమె కొన్ని రోజులుగా మందులు మానేసిందని, అయితే ఆమె ఇంతటి ఘాతుకానికి పాల్పడుతుందని తాను ఊహించలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫాబియానా ఎంతో ఆప్యాయంగా, ఉల్లాసంగా ఉండేదని ఆమె పెద్దనాన్న పున్రాజ్ సింగ్ గుర్తుచేసుకున్నారు. తన  నానమ్మను, బంధువులను ఎంతో ప్రేమగా చూసుకునేదంటూ కంట తడిపెట్టుకున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం  చిన్నారి ముఖంపై గాయాలు ఉన్నాయని, అలాగే ఆమె కళ్ళు, గుండె, ఊపిరితిత్తులలో రక్తస్రావం వల్ల ఏర్పడిన చిన్న మచ్చలు (పెటెచియా) ఉన్నాయని పోస్ట్‌మార్టమ్‌లో తేలింది. ఇవి ఊపిరిసలపకపోవడానికి (అస్ఫిక్సియా) సంబంధించిన లక్షణాలుగా ఉన్నాయని ఫిర్యాదు పేర్కొంది.

ఇదీ చదవండి: భార్యను కొట్టానని నిరూపిస్తారా? ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో

అంత్యక్రియల కోసం తండ్రి కష్టాలు 
ఫాబియానా తండ్రి తన కూతురు అంత్యక్రియల ఖర్చుల కోసం గోఫండ్‌మీ (GoFundMe) ద్వారా 18,000 డాలర్లు సేకరించేందుకు ప్రయత్నిస్తు న్నారు.  నా బిడ్డను  ఎంతగానో  ప్రేమించాను, ఇపుడామె  లేకపోవడం అంటే ప్రపంచాన్నే కోల్పోయినట్లుగా ఉంది. ప్రస్తుతం అంత్యక్రియల ఖర్చులు భరించే స్థితిలో లేను. అద్దె కారులో ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తూనే, ఈ కష్టసమయాన్ని ఎదుర్కొంటున్నాను అంటూ  కుల్దీప్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురికి ఘనంగా అంత్యక్రియలు జరిపేందుకు సాయం చేయాలని ఆయన వేడుకున్నారు..

ఇదీ చదవండి: ఆయుధపూజలో ఏకే-47తో ‘లేడీ సింగం’ వీడియో వైరల్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement