మహారాష్ట్రలోని ఒక కొండపై నుంచి దూకి, గుజరాత్‌కు చెందిన వ్యక్తి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. కుటుంబ కలహాలు, తన భార్య,ఆమె కుటుంబ సభ్యుల వల్ల తాను వేధింపులు, ఒత్తిడిని తట్టుకోలేక తాను చనిపోతున్నానని 13 నిమిషాల పాటు ఒక వీడియోను రికార్డు చేశారు. ఆ ఒ. అంతేకాకుండా, ఇటువంటి కేసులకు సంబంధించిన చట్టాలలో మార్పులు తీసుకురావాలని కోరడం నెట్టింట చర్చకు దారి తీసింది.
"ఈరోజు నేను ఈ లోయలోకి దూకి నా జీవితాన్ని ముగించుకోబోతున్నాను. జీవితంలో ఎటువంటి ఆశ కనిపించనప్పుడు, మనిషి అంతరాత్మ విచ్ఛిన్న మవుతుంది. వివాహం అనేది అనేక జన్మల వరకు కొనసాగాల్సిన పవిత్ర బంధమని మనం చెబుతుంటాం. ఇవన్నీ మాటల్లో, రాతల్లో వినడానికి బాగుంటాయి. కానీ నేటి కాలంలో, ఇద్దరు వ్యక్తుల అభిప్రాయాలు, స్వభావాలు, అలవాట్లు కలవనప్పుడు , గొడవలు తలెత్తినప్పుడు, వారు విడాకులు తీసుకుంటారు." అంటూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అతని కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఇదీ చదవండి: నర్సు దారుణ హత్య : సీఎం విజయ్‌పై స్టాలిన్ మండిపాటు
⚠️ DISTURBING CONTENT WARNING ⚠️ Vishwarajsinh Mayursinh Gohil, a resident of Chitra in #Bhavnagar (#Gujarat), died by suicide after jumping from the Konkankada cliff into a 1,700-foot-deep gorge at Harishchandragad in #Maharashtra's Ahmednagar district. In this final 13-minute video, he says false #498A cases take lives. Pleading for justice, he says, "I fall at your feet".
— League of India - The INDIC POST Of The World (@league_of_india) October 18, 2026
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం గుజరాత్‌లోని పోస్టల్ శాఖలో పనిచేసే విశ్వరాజ్ గోహిల్అక్టోబర్ 12న మహారాష్ట్రలోని హరిశ్చంద్రగఢ్‌లో ఉన్న కొంకణ్‌కడ కొండ నుంచి దాదాపు 1,700 అడుగుల లోతైన లోయలోకి దూకి ప్రాణాలు తీసుకున్నారు. మరణానికి ముందు, తీసుకున్న సెల్ఫీ వీడియోలో సంచలన ఆరోపణలు చేశారు. తన వైవాహిక జీవితంలో విభేదాలు, గృహహింస ఆరోపణలు తనను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాయని, తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు మోపారని గోహిల్ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సయోధ్య చర్చలు, ఆభరణాల వివాదానికి సంబంధించిన ఆందోళనలను కూడా ప్రస్తావించారు. అంతేకాదు గృహహింస, వివాహ వివాదాలకు సంబంధించిన చట్టాలను సమీక్షించాలని అధికారులను కోరారు, వాటి అమలులో మార్పులు తీసుకురావాలంటూ చాలా ఆవేదన వ్యక్తంచేశారు. అయితే ఆయన చేసిన ఆరోపణలపై ఎలాంటి ధృవీకరణలేదు.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">⚠️ DISTURBING CONTENT WARNING ⚠️ Vishwarajsinh Mayursinh Gohil, a resident of Chitra in #Bhavnagar (#Gujarat), died by suicide after jumping from the Konkankada cliff into a 1,700-foot-deep gorge at jexe Harishchandragad in #Maharashtra's Ahmednagar district. In this final 13-minute video, he says false #498A cases take lives. Pleading for justice, he says, "I fall at your feet".</p>— League of India - The INDIC POST Of The World (@league_of_india) <a href="https://x.com/league_of_india/status/2111827780036186583?ref_src=twsrc%5Etfw">October 18, 2026</a></blockquote> <script async src="https://platform.x.com/widgets.js" charset="utf-బాడీకోసం గంటల తరబడి, రెస్క్యూ ఆపరేషన్
కొండ సమీపంలో ఒక మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్ పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు అహిల్యానగర్ జిల్లా రాజూర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గోహిల్ కుటుంబాన్ని సంప్రదించగా, తమకు అందిన వీడియో గురించి వారు పోలీసులకు తెలిపారు. లోయ లోతు ఎక్కువగా ఉండటంతో పోలీసులు డ్రోన్ కెమెరా సహాయంతో మృతదేహం ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. పర్వతారోహకుల (మౌంటెనీర్స్) సహాయంతో శుక్రవారం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి, దాదాపు 24 గంటల తర్వాత మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని భావ్‌నగర్‌కు తరలించారు.
ఇదీ చదవండి: హాట్ టాపిక్ : ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై టీవీకే స్పందన
మృతదేహం లభ్యమైన ప్రాంతం థానే రూరల్ పరిధిలోని టోకావాడే పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుండటంతో అక్కడ కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏడీఆర్ నమోదు చేశాం. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, మరణానికి ముందు ఆయన రికార్డు చేసిన వీడియోతో సహా విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని టోకావాడే పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ శీతల్‌కుమార్ నాయక్ తెలిపారు.
కాగా విశ్వరాజ్ గోహిల్‌కు ఈ ఏడాది ఫిబ్రవరి 8న ధారబా అజయ్‌సింహ్ సర్వైయాతో వివాహం జరిగింది. అయితే సెప్టెంబర్ 12న వారి మధ్య వివాదం తలెత్తడంతో, తనను గృహహింసకు గురిచేశారంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ కూడా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 9న గోహిల్ కోర్టుకు కూడా హాజరయ్యారు.
ఇదీ చదవండి: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు రూ. 50 వేలు అడ్వాన్స్ : గుర్తు పట్టకూడదని గుండు


