ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో దసరా సందర్భంగా ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. దసరా ఉత్సవాల్లో రాష్ట్రంలో ముఖ్య ఐపీఎస్ (IPS) అధికారిగా పేరుగాంచిన జిల్లా ఎస్‌పీ అంకితా శర్మ(Ankita Sharm) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దసరా రోజు నిర్వహించే ఆయుధ పూజలో పోలీసు యూనిఫాంలో కాకుండా సంప్రదాయ చీరకట్టులో కనిపించారు. సాంప్రదాయ శస్త్ర పూజ (ఆయుధ పూజ) నిర్వహించిన అనంతరం తుపాకీ చేతబూని, దాని సామర్థ్యాన్ని పరీక్షించేందుకు కాల్పులు జరిపారు. చీరకట్టులో కనిపించిన ఆమె వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
'లేడీ సింగం'గా ప్రసిద్ధి చెందిన అంకితా శర్మ నిబ్ధతతో కూడిన పోలీసు విధులకు, శాంతిభద్రతల పరిరక్షణకు పేరుగాంచారు. పబ్లిక్ ఇమేజ్‌తో సోషల్ మీడియాలోనూ ఆమె చురుగ్గా ఉంటూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజా వీడియోతో ఆమె ధైర్యసాహసాలను, నిర్భయ శైలి విశేషంగా నిలుస్తోంది.
During the Shastra Puja event on Vijayadashami, SP Ankita Sharma of Rajnandgaon, Chhattisgarh, handled an AK-47 rifle and performed aerial firing with it. https://t.co/NrXtosmUuG
— Treeni (@treeni) October 20, 2026
భారతదేశంలో దసరా నాడు ఆయుధాలను పూజించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే పోలీసు, భద్రతా బలగాలు కూడా ప్రతి ఏటా ఈ పూజను ఘనంగా నిర్వహిస్తుంటాయి. ఈ ఆచారంలో భాగంగానే అంకితా శర్మ రాజ్‌నంద్‌గావ్ పోలీసు లైన్స్‌లో జరిగిన కార్యక్రమంలో పూజలు నిర్వహించి, అనంతరం ఏకే-47 తుపాకీతో కాల్పులు జరిపినట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.
ఈ వీడియో ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందనను తెచ్చిపెట్టింది. చీరకట్టులో ఉన్నమహిళా అధికారి అసాల్ట్ రైఫిల్‌ను అత్యంత నైపుణ్యంతో హ్యాండిల్ చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కొందరు వినియోగదారులు ఆమె ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసించగా, మరికొందరు మాత్రం అగ్నిప్రమాద భద్రతా ప్రమాణాలు (ఫైర్‌ఆర్మ్ సేఫ్టీ)నిర్దేశిత షూటింగ్ రేంజ్ కాకుండా బయట కాల్పులు జరపడం ఎంతవరకు సమంజసం అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్చ ద్వారా ఛత్తీస్‌గఢ్‌లో ఆమె పోలీసు సేవల గురించి మరోసారి అందరి దృష్టికి వచ్చింది.
ఎవరీ అంకితా శర్మ
అంకితా శర్మ ఛత్తీస్‌గఢ్ క్యాడర్‌కు చెందిన 2018 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఛత్తీస్‌గఢ్‌లోని క్లిష్టమైన ప్రాంతాల్లో, నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో ఆమె తన పోస్టింగ్ కాలంలో నేరస్థులు, నక్సలైట్లకు వ్యతిరేకంగా పలు కఠినమైన ఆపరేషన్లకు నాయకత్వం వహించారు. ప్రజలతో ఆమెకున్న సత్సంబంధాలు, కఠినమైన పరిపాలనా నిర్ణయాలు ఆమెను పోలీసు శాఖలో 'లేడీ సింగం'గా నిలబెట్టాయి.
ఇదీ చదవండి: భార్యను కొట్టానని నిరూపిస్తారా? ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో
మూడో ప్రయత్నంలో యూపీఎస్‌సీ విజయం
అంకితా శర్మ జూన్ 25, 1990న ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో జన్మించారు. 2017 యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా 203వ ర్యాంకు సాధించి సొంత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ క్యాడర్‌ను పొందారు. ఆమె మూడో ప్రయత్నంలో సివిల్స్ సాధించారు. మొదటి ప్రయత్నంలో మెయిన్స్ వరకు వెళ్లగా, రెండో ప్రయత్నంలో ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోయారు.
ఖైరాఘర్ తొలి మహిళా ఎస్పీ
అంకితా శర్మ తన మొదటి పోస్టింగ్‌ను ఛత్తీస్‌గఢ్‌లోని భటపారాలో చేశారు. అలాగే రాయ్‌పూర్‌లోని ఆజాద్‌చౌక్‌లో సీఎస్పీగా కూడా సేవలు అందించారు. మే 2022లో ఖైరాఘర్ ఎస్పీగా నియమితులై, ఆ జిల్లాకు తొలి మహిళా ఎస్పీగా రికార్డు సృష్టించారు.


