మావోయిస్టుల కంచుకోటలో మోదీ దీపావళి వేడుకలు | Pm Narendra Modi Celebrates Diwali With Security Personnel In Bastar | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల కంచుకోటలో మోదీ దీపావళి వేడుకలు

Nov 8 2026 1:03 PM | Updated on Nov 8 2026 1:11 PM

Pm Narendra Modi Celebrates Diwali With Security Personnel In Bastar

ఛత్తీస్‌గఢ్:  బస్తర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ(ఆదివారం) పర్యటించారు. గతంలో మావోయిస్టు ప్రాబల్యం ఉన్న బస్తర్‌లో తొలిసారి పర్యటించిన మోదీ.. మావోయిస్టు కంచుకోటలో భద్రతా సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. నక్సల్స్‌ ఏరివేతతో బస్తర్‌లో అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు.

బస్తర్‌ ఇప్పుడు నక్సల్స్‌ రహితంగా మారింది. దేశ రక్షణకు అహర్నిశలు శ్రమిస్తున్న భద్రతా సిబ్బందికి, అమరవీరులకు సెల్యూట్‌. బస్తర్‌ రీజియన్‌లో భద్రతా బలగాలు సాధించిన పురోగతి అభినందనీయం. గత 12 నెలలుగా ఎలాంటి ప్రాణనష్టం లేకుండా సీఆర్పీఎఫ్‌ రికార్డు సాధించింది. మీరంతా నా కుటుంబం.. ఈ దీపావళిని బస్తర్‌ అడవుల్లో మీ  మధ్య జరుపుకోవడానికి వచ్చా. నక్సలిజంపై గత ప్రభుత్వాలు ఉదారంగా వ్యవహరించాయి. నక్సలిజంను నిర్మూలించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు బయలుదేరే ముందు ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. ‘‘మన ధైర్యవంతులైన భద్రతా బలగాలతో కలిసి దీపావళి జరుపుకునేందుకు బస్తర్‌కు వెళ్తున్నాను. ఒకప్పుడు ఈ ప్రాంతంలో నక్సలిజం ప్రాబల్యం ఉండేది. ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి వెల్లివిరుస్తోంది. దేశం కోసం మన భద్రతా సిబ్బంది చేస్తున్న త్యాగాలు, నిస్వార్థ సేవ, అచంచలమైన అంకితభావానికి సెల్యూట్‌ చేసేందుకు వెళ్తున్నాను’’ అంటూ మోదీ ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: చైనా సరిహద్దుల్లో వాయుసేన పాగా! 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement