ఉద్యోగుల కోసం బాస్.. ఊహించని సర్‌ప్రైజ్! | Surat Man Gives Rs 1 Lakh Cash Bonus To Every Employee For Diwali | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల కోసం బాస్.. దీపావళికి ఊహించని సర్‌ప్రైజ్!

Nov 8 2026 11:23 AM | Updated on Nov 8 2026 11:57 AM

Surat Man Gives Rs 1 Lakh Cash Bonus To Every Employee For Diwali

దీపావళి వచ్చిందంటే ఉద్యోగులకు స్వీట్లు, డ్రైఫ్రూట్స్‌ బాక్స్‌లు ఇవ్వడం సాధారణం. మరికొన్ని సంస్థలు అదనపు బోనస్‌ ప్రకటిస్తుంటాయి. కానీ గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ వస్త్ర వ్యాపారి మాత్రం తన ఉద్యోగులకు ఊహించని కానుక ఇచ్చారు. తన దగ్గర పనిచేస్తున్న 20 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా నగదు బోనస్‌గా అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

20 మంది ఉద్యోగులకు భారీ నగదు కానుక
సూరత్‌కు చెందిన రామ్‌స్వరూప్‌ ముండే ఓ వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా తన దగ్గర పనిచేస్తున్న 20 మంది ఉద్యోగులకు భారీ నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వెండి రంగులో ఉండే సంప్రదాయ పూజా పళ్లాల్లో రూ.10 నుంచి రూ.500 వరకు నోట్ల కట్టలను అందంగా అమర్చారు. ఒక్కో ఉద్యోగికి లక్ష రూపాయలకు పైగా నగదును బహుమతిగా ఇచ్చారు.

ఉద్యోగులు కాదు.. కుటుంబ సభ్యులు
ఈ సందర్భంగా రామ్‌స్వరూప్‌ మాట్లాడుతూ.. తన దగ్గర పనిచేసే వారిని కేవలం ఉద్యోగులుగా చూడనని, తన కుటుంబ సభ్యులుగానే భావిస్తానని చెప్పారు. వారంతా తమ కుటుంబాలతో కలిసి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు.

దీపావళికి ఉద్యోగులకు బోనస్ లేదా గిఫ్ట్స్ ఇవ్వడం కొత్తేమీ కాదు, ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఐఫోన్స్ సైతం బహుమతిగా అందించాయి.

యూఏఈ కంపెనీ
యూఏఈలో ఓ కంపెనీకి చెందిన మహిళా మేనేజింగ్ డైరెక్టర్ హసీనా నిషాద్. తన కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు కొత్త ఐఫోన్లను గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

వీడియోలో గమనించినట్లయితే.. మహిళా ఉద్యోగులందరూ కాన్ఫరెన్స్ రూమ్‌కు రావడం చూడవచ్చు. అక్కడ ఉద్యోగులు కుర్చీలను వెనక్కి లాగి కూర్చోబోయే సమయంలో వారికి ఓ సర్‌ప్రైజ్ కనిపించింది. ప్రతి కుర్చీలోనూ అందంగా ప్యాక్ చేసిన గిఫ్ట్ బాక్సులు ఉన్నాయి. వాటిని ఓపెన్ చేసి చూస్తే.. కొత్త ఐఫోన్లు కనిపించాయి. దీంతో ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఒక్కొక్కరు తమ గిఫ్ట్‌ను చూసుకుంటూ ఆశ్చర్యంతో నవ్వులు చిందించారు.

అయితే ఈ వీడియోలో అందరినీ ఎక్కువగా ఆకట్టుకున్న మరో విషయం ఏమిటంటే.. కంపెనీలో పనిచేసే హౌస్‌కీపింగ్ సిబ్బందిని కూడా హసీనా అంతే ఆప్యాయంగా చూసుకున్నారు. ఓ మహిళా హౌస్‌కీపింగ్ ఉద్యోగి హసీనాకు షర్బత్ అందిస్తున్న సమయంలో ఆమెకు కూడా కొత్త ఐఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. అసలు ఊహించని ఈ గిఫ్ట్ చూసి ఆ మహిళ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. హసీనాను గట్టిగా కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సన్నివేశం వీడియోలో అందరినీ కదిలిస్తోంది.

ఢిల్లీ కంపెనీ
ఢిల్లీలోని ఓ కంపెనీ అందరికీ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. తమ ఉద్యోగులకు ఏకంగా ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్లను దీపావళి కానుకగా అందించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

 ఇదీ చదవండి: నెతన్యాహుకు మరో ఎదురు దెబ్బ

న్యూఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన కంపెనీ.. ఉద్యోగులకు ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇచ్చిన వీడియోను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోలో ఉద్యోగుల డెస్క్‌లపై అందంగా రిబ్బన్లతో అలంకరించిన ఐఫోన్ 16 ఫోన్లు కనిపిస్తున్నాయి. తెలుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల్లో ఉన్న ఫోన్లను కంప్యూటర్ల ముందు ఉంచారు. చివర్లో కొంతమంది మహిళా ఉద్యోగులు తమకు వచ్చిన గిఫ్టులను చూసి ఎంతో సంతోషంగా స్పందించడం చూడవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement