సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యు నల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) నూతన చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్ బిందాల్ నియమి తులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసింది. గతంలో ఎన్‌సీఎల్‌ఏటీ చైర్‌పర్సన్ గా వ్యవహరించిన జస్టిస్ అశోక్ భూషణ్ పదవీ కాలం ఈ ఏడాది జూలై 4వ తేదీన ముగియడంతో ఆ స్థానం ఖాళీ అయింది.
కార్పొరేట్ వ్యవహా రాలు, కంపెనీ చట్టాలకు సంబంధించిన వివా దాల పరిష్కారంలో ఈ ట్రిబ్యునల్‌ది అత్యంత కీలక పాత్ర. కాగా, జస్టిస్ అశోక్ భూషణ్ రిటై ర్మెంట్ అనంతరం ఎన్‌సీఎల్‌ఏటీ జ్యుడీషి యల్ మెంబర్‌గా ఉన్న జస్టిస్ యోగేశ్ ఖన్నా జూలై 5 నుంచి తాత్కాలిక (ఆఫీషి యేటింగ్) చైర్‌పర్సన్‌గా విధులు నిర్వర్తి స్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయన తాత్కాలిక పదవీకాలాన్ని అక్టోబర్ 5న మరో మూడు నెలల పాటు పొడిగించింది. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో జస్టిస్ రాజేశ్ బిందాల్ త్వరలోనే పూర్తిస్థాయి చైర్‌పర్సన్‌గా ట్రిబ్యునల్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
హరియాణాలో 1961 ఏప్రిల్ 16న జన్మించిన జస్టిస్ రాజేశ్ బిందాల్ 1985లో కురుక్షేత్ర విశ్వవిద్యా లయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది పంజాబ్–హరియాణా హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 2006లో పంజాబ్–హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2018లో జమ్మూకశ్మీర్ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ బిందాల్.. 2020లో ఆ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2021లో కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021న అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2023 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పదవీ విరమణ చేశారు.


