నవంబర్ 11న పదవీ విరమణ
కొత్త చైర్మన్‌గా బెహ్రామ్ వకీల్
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ రిటైల్ సంస్థ ‘ట్రెంట్ లిమిటెడ్’ బోర్డు నాయకత్వంలో కీలక మార్పు చోటుచేసుకుంది. కంపెనీ చైర్మన్, డైరెక్టర్‌గా సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న నోయెల్ ఎన్. టాటా నవంబర్ 11న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో నూతన చైర్మన్‌గా ‘బెహ్రామ్ వకీల్’ను కంపెనీ బోర్డు నియమించింది. ఈ నియామకం నవంబర్ 12 నుంచి అమలులోకి వస్తుందని స్టాక్ ఎక్సే్చంజీలకు సమాచారం ఇచ్చింది.
1997 నుంచి ట్రెంట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నోయెల్ టాటా సేవలను బోర్డు కొనియాడింది. ఆయన అందించిన అసమాన కృషికి ధన్యవాదాలుతెలుపుతూ తీర్మానం ఆమోదించింది. నోయెల్ టాటా సేవలకు గౌరవసూచకంగా నవంబర్ 12 నుంచి ‘గౌరవ చైర్మన్’ హోదాను కేటాయించింది. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, గ్రోసరీ విభాగాల్లో ట్రెంట్ తన రిటైల్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్న తరుణంలో బెహ్రామ్ వకీల్ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.


