అనిల్ అగర్వాల్‌కు చెందిన మైనింగ్ రంగ దిగ్గజం వేదాంతా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. వార్షికంగా జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 2 రెట్లు జంప్‌చేసి రూ. 3,650 కోట్లను అధిగమించింది. కమోడిటీల ధరలు పుంజుకోవడం, సానుకూల ఫారెక్స్ కదలికలు, అమ్మకాల పరిమాణం ఇందుకు దోహదపడ్డాయి.
గతేడాది(2025–26) ఇదే కాలంలో కేవలం రూ. 1,798 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ.16,736 కోట్ల నుంచి రూ. 26,356 కోట్లకు ఎగసింది. కాగా.. జింక్ ఇండియా కంపెనీ చరిత్రలోనే ఒక త్రైమాసికంలో అత్యధికంగా 271000 టన్నుల మైన్‌డ్ మెటల్ ఉత్పత్తిని సాధించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ బాటలో సిల్వర్ ఉత్పత్తి 20 శాతం ఎగసి 173 టన్నులకు చేరినట్లు వెల్లడించింది.


