న్యూఢిల్లీ: వాణిజ్య వాహన రంగ టాటా గ్రూప్ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. వార్షికంగా జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నష్టాలను వీడి రూ. 1,254 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు అమ్మకాలు పుంజుకోవడం దోహదపడింది.
గతేడాది(2025–26) ఇదే కాలంలో రూ. 867 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అయితే ఇందుకు టాటా క్యాపిటల్‌లో పెట్టుబడులపై రూ. 2,026 కోట్లమేర మార్క్ టు మార్కెట్(ఎంటూఎం) నష్టాలు ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఈ కాలంలో నిర్వహణ లాభం(ఇబిటా) 31 శాతం మెరుగుపడి రూ. 2,800 కోట్లను తాకగా.. ఇబిటా మార్జిన్ 0.4 శాతం నీరసించి 10.9 శాతానికి పరిమితమైంది.
కాగా.. మొత్తం ఆదాయం సైతం 36 శాతం జంప్‌చేసి రూ. 25,338 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 18,585 కోట్ల ఆదాయం అందుకుంది. గతంలో టీఎంఎల్ కమర్షియల్ వెహికల్స్‌గా వ్యవహరించిన కంపెనీ మొత్తం 1.35 లక్షల వాహనాలు విక్రయించింది. గత క్యూ2లో ఇవి 94,681 యూనిట్లుగా నమోదయ్యాయి. దేశీ అమ్మకాలు 31 శాతం ఎగసి 1.14 యూనిట్లకు చేరగా.. అంతర్జాతీయ బిజినెస్ రెట్టింపుకావడంతో 21,132 యూనిట్లు విక్రయించింది. గత క్యూ2లో ఇవి 7,632 యూనిట్లు మాత్రమే.


