ఎల్‌ఐసీ దూకుడు.. భారీగా పెరిగిన ఆదాయం! | LIC Reports Strong Q2 Results With 20% Profit Growth, Net Profit Reaches Rs 12,076 Crore, Check More Details | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ దూకుడు.. భారీగా పెరిగిన ఆదాయం!

Nov 6 2026 11:16 AM | Updated on Nov 6 2026 11:36 AM

LIC Q2 Results Profit jumps 20 Percent YoY

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026-27) రెండో త్రైమాసికంలో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై-సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం వార్షికంగా 20 శాతం జంప్‌చేసి రూ.12,076 కోట్లకు చేరింది. గతేడాది(2025-26) ఇదే కాలంలో రూ.10,053 కోట్లు ఆర్జించింది.

మొత్తం ఆదాయం సైతం రూ.2,39,614 కోట్ల నుంచి రూ.2,62,739 కోట్లకు బలపడింది. నికర ప్రీమియం ఆదాయం రూ.1,26,479 కోట్ల నుంచి రూ.1,47,018 కోట్లకు ఎగసింది. రెన్యువల్‌ ప్రీమియం రూ.64,996 కోట్ల నుంచి రూ.68,375 కోట్లకు పుంజుకుంది. అయితే తొలి ఏడాది ప్రీమియం రూ.10,836 కోట్ల నుంచి రూ.10,432 కోట్లకు స్వల్పంగా వెనకడుగు వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement