ప్రైవేటు బ్యాంకులు.. పటిష్ట లాభాలు | Kotak Mahindra IDFC First Bank Q2 Results FY27 Profit growth | Sakshi
Sakshi News home page

ప్రైవేటు బ్యాంకులు.. పటిష్ట లాభాలు

Oct 26 2026 3:45 PM | Updated on Oct 26 2026 3:56 PM

Kotak Mahindra IDFC First Bank Q2 Results FY27 Profit growth

ప్రయివేట్‌ రంగ దిగ్గజం కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. వార్షికంగా జూలై–సెప్టెంబర్‌(క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 26 శాతం ఎగసి రూ. 5,645 కోట్లకు చేరింది. స్టాండెలోన్‌ నికర లాభం సైతం 29 శాతం జంప్‌చేసి రూ. 4,212 కోట్లను తాకింది. ఆదాయం పుంజుకోవడం, ప్రొవిజన్లు తగ్గడం ఇందుకు సహకరించింది. నికర  వడ్డీ ఆదాయం 16 శాతం వృద్ధితో రూ. 8,459 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.39 శాతం నుంచి 1.04 శాతానికి దిగివచ్చాయి. స్లిప్పేజీలు రూ. 1,629 కోట్ల నుంచి రూ. 1,230 కోట్లకు తగ్గాయి. మొత్తం ప్రొవిజన్లు 15 శాతం వెనకడుగుతో రూ. 803 కోట్లకు పరిమితమయ్యాయి.  

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ లాభం జూమ్‌

ప్రయివేట్‌ రంగ సంస్థ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. వార్షికంగా జూలై–సెప్టెంబర్‌(క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం మూడు రెట్లు దూసుకెళ్లి రూ. 1,045 కోట్లకు చేరింది. గతేడాది(2025–26) ఇదే కాలంలో కేవలం రూ. 352 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 11,828 కోట్ల నుంచి రూ. 14,218 కోట్లకు జంప్‌చేసింది. వడ్డీ ఆదాయం సైతం రూ. 9,937 కోట్ల నుంచి రూ. 11,922 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.86 శాతం నుంచి 1.32 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.52 శాతం నుంచి 0.4 శాతానికి దిగివచ్చాయి. కనీస మూలధన నిష్పత్తి 14.67 శాతంగా నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement