టాటా టెక్నాలజీస్‌.. లాభం ప్లస్‌ | Tata Technologies Q2 Results Net Profit Revenue Jumps | Sakshi
Sakshi News home page

టాటా టెక్నాలజీస్‌.. లాభం ప్లస్‌

Oct 15 2026 6:37 PM | Updated on Oct 15 2026 6:55 PM

Tata Technologies Q2 Results Net Profit Revenue Jumps

న్యూఢిల్లీ: ఐటీ రంగ టాటా గ్రూప్‌ కంపెనీ టాటా టెక్నాలజీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. వార్షికంగా జూలై–సెప్టెంబర్‌(క్యూ2)లో నికర లాభం దాదాపు 4 శాతం పుంజుకుని రూ. 171 కోట్లను అధిగమించింది. ఆటోమోటివ్‌ క్లయింట్ల నుంచి డిమాండ్‌ దన్నునిచ్చినట్లు కంపెనీ పేర్కొంది.

గతేడాది(2025–26) ఇదే కాలంలో రూ. 166 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 1,323 కోట్ల నుంచి రూ. 1,699 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ. 1,500 కోట్లకు పెరిగాయి. గత క్యూ2లో ఇవి రూ. 1,323 కోట్లుగా నమోదయ్యాయి. త్రైమాసికవారీగా ఆదాయం 3.4 శాతం బలపడగా.. నికర లాభం నామమాత్రంగా క్షీణించింది. ఈ కాలంలో 300 మంది ఉద్యోగులను జత కలుపుకున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో వారెన్‌ హారిస్‌ పేర్కొన్నారు. పూర్తి ఏడాదిలో 14,000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement