మీరు ఐఫోన్ వాడుతున్నారా?, అయితే.. ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే.. ఎలాంటి అనుమానాస్పద లింక్స్ క్లిక్ చేయకపోయినా, తెలియని యాప్స్ డౌన్‌లోడ్ చేయకపోయినా.. మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ హెచ్చరించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాత ఐఓఎస్ వెర్షన్లు ఉపయోగిస్తున్నవారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని పావెల్ దురోవ్ తెలిపారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైన వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తే చాలు.. హ్యాకర్లు ఫోన్‌లోకి చొరబడి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని చెప్పారు. అయితే.. ఏయే ఐఓఎస్ వెర్షన్లలో ఈ సమస్య ఉంది?, ఎంతమంది ఐఫోన్ యూజర్లు ప్రమాదంలో ఉన్నారు?, అనే వివరాలను ఆయన వెల్లడించలేదు.
సైబర్ దాడులు
ఇటీవల కొన్ని ప్రముఖ వెబ్‌సైట్లపై కూడా సైబర్ దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. నవంబర్ 17న హ్యాకర్లు 178 వెబ్‌సైట్లలో ప్రమాదకరమైన కోడ్ ఉన్నట్లు రాయిటర్స్ తెలిపింది. ఇందులో జూమ్, హెచ్ఎస్బీసీ, సీఎన్ఎన్, సేల్స్‌ఫోర్స్, ఐకియా వంటి సంస్థలకు సంబంధించిన వెబ్‌సైట్లు కూడా ఉన్నాయి. ఈ దాడుల ద్వారా యూజర్ల బ్యాంక్ వివరాలు, వెబ్‌సైట్ లాగిన్ సమాచారం, ఇతర వ్యక్తిగత వివరాలను దొంగిలించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఉద్యోగంపై మారుతున్న ఆలోచన.. సర్వేలో ఆసక్తికర విషయాలు!
ఫోన్ సురక్షితంగా ఉండాలంటే?
మీ ఐఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోవాలంటే.. ముందుగా ఫోన్‌లో లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇందుకోసం సెట్టింగ్స్ ఓపెన్ చేసి జనరల్‌లోకి వెళ్లి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై క్లిక్ చేయండి. కొత్త అప్‌డేట్ ఉంటే వెంటనే ఇన్‌స్టాల్ చేసుకోండి. అలాగే ఆటోమాటిక్ అప్డేట్ ఆప్షన్‌ను ఆన్‌లో ఉంచండి. దీనివల్ల కొత్త అప్‌డేట్స్ వచ్చినప్పుడు ఫోన్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. తెలియని వెబ్‌సైట్లను ఓపెన్ చేయకుండా.. ఉండటంతో పాటు, ఫోన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటే హ్యాకింగ్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
🚨 iPhone users are being hacked on a massive scale. If your iOS is even slightly outdated, all your data is at risk. Just opening a website can be enough to get you hacked. We're sending this warning to all our users on older iOS versions: https://t.co/k2BKf5N5ua
— Pavel Durov (@durov) November 27, 2026


