డీజిల్ అవసరం లేకుండా నడిచే ట్రాక్టర్ | Mahindra Showcases Ethanol Flex Fuel Tractor At Agrovision 2026 | Sakshi
Sakshi News home page

డీజిల్ అవసరం లేకుండా నడిచే ట్రాక్టర్

Nov 29 2026 9:04 AM | Updated on Nov 29 2026 9:09 AM

Mahindra Showcases Ethanol Flex Fuel Tractor At Agrovision 2026

మహీంద్రా కంపెనీ వ్యవసాయ రంగంలో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే పెట్రోల్, ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో నడిచే సరికొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ ట్రాక్టర్‌ను తొలిసారి ప్రదర్శించింది. నాగ్‌పూర్‌లో నవంబర్ 27 నుంచి 30 వరకు జరుగుతున్న అగ్రోవిజన్ 2026 వ్యవసాయ ప్రదర్శనలో ఈ ట్రాక్టర్‌ను సంస్థ అందుబాటులో ఉంచింది.

మహీంద్రా ఫ్లెక్స్ ఫ్యూయెల్ ట్రాక్టర్ 49 హార్స్ పవర్ సామర్థ్యం కలిగిన యువో టెక్ ప్లస్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించింది. సాధారణంగా ట్రాక్టర్లు డీజిల్‌తో నడుస్తుంటాయి. కానీ ఈ కొత్త మోడల్ పెట్రోల్, ఇథనాల్ మిశ్రమంతో పనిచేస్తుంది. అయితే సంస్థ ఈ ట్రాక్టర్ ధర ఎంత?, ఎప్పుడు లాంచ్ చేయనున్నారు?, ఫీచర్స్ ఏమిటి?, డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే పనితీరు ఎలా ఉంటుంది? అనే విషయాలను సంస్థ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

ఇథనాల్‌
ఇథనాల్‌ను కేవలం చెరకు నుంచే కాకుండా మొక్కజొన్న, మొక్కజొన్న పొట్టు, పంట వ్యర్థాలు, వ్యవసాయ అవశేషాల నుంచి కూడా తయారు చేయవచ్చు. అంటే.. రైతులు పండించే పంటలతో పాటు వ్యవసాయ వ్యర్థాలను కూడా ఇంధన తయారీకి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి పెట్టిన మహీంద్రా, ఈ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది. అగ్రోవిజన్ ప్రదర్శనలో మహీంద్రా ట్రాక్టర్స్ సీఈఓ హర్ష్ రాయ్ ఈ ట్రాక్టర్‌ను కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కూడా వివరించారు.

ఇదీ చదవండి: AI ఎఫెక్ట్.. 2.4 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement