గోల్డ్‌ లోన్‌.. ధరల పతనంతో ముప్పు! | Gold Loan Crisis Falling Prices Put Indian Banks NBFCs on High Alert | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ లోన్‌.. పసిడి ధరల పతనంతో పూచీకత్తుకు ముప్పు!

Nov 28 2026 9:17 PM | Updated on Nov 28 2026 9:28 PM

Gold Loan Crisis Falling Prices Put Indian Banks NBFCs on High Alert

బంగారు రుణాలపై పెరుగుతున్న ఒత్తిడి..

దేశీయంగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో బంగారు ఆభరణాలపై రుణాలిచ్చిన బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) పూచీకత్తు విలువపై ఒత్తిడి నెలకొంది. గరిష్ఠ ధరల సమయంలో రుణాలు తీసుకున్న ఖాతాదారుల పూచీకత్తు విలువ తగ్గడంతో రుణ-విలువ నిష్పత్తి (ఎల్‌టీవీ) పరిమితులకు ప్రమాదం ఏర్పడింది.

రుణాల వృద్ధికి పసిడి పతనం సవాలు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రకారం, 2024 మార్చి నుంచి 2026 మధ్య బంగారు రుణాలు వార్షిక సగటున 42.4 శాతం చొప్పున వృద్ధి చెంది, గృహ రుణాల తర్వాత అతిపెద్ద రిటైల్‌ విభాగంగా ఎదిగాయి. అయితే, పసిడి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటే రుణదాతల భద్రతా మార్జిన్‌ క్షీణిస్తుందని ఆర్‌బీఐ అప్పట్లోనే హెచ్చరించింది. ప్రస్తుతం ధరలు దిగిరావడంతో అదే పరిస్థితి ఎదురైంది. దీనిపై ప్రత్యేక చర్యలు ప్రకటించకపోయినా ఆర్‌బీఐ పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేసినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

కఠినంగా ఎల్‌టీవీ నిబంధనలు

2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఆర్‌బీఐ సమగ్ర మార్గదర్శకాల ప్రకారం, బంగారు రుణాలపై గరిష్ఠ ఎల్‌టీవీ పరిమితులను రూ.2.5 లక్షల వరకు 85 శాతం, రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 80 శాతం, రూ.5 లక్షలకు మించితే 75 శాతంగా నిర్ణయించారు. రుణ కాలవ్యవధి మొత్తం ఈ నిష్పత్తిని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. పసిడి ధరల తగ్గుదలతో ఎల్‌టీవీ పరిమితి దాటితే రుణ సంస్థలు అదనపు పూచీకత్తు కోరడం లేదా కొంత బకాయిని ముందస్తుగా చెల్లించాలని ఆదేశించాల్సి వస్తుంది. చెల్లింపుల్లో విఫలమైతే ఆభరణాల వేలం అనివార్యమవుతుంది.

రుణదాతలకు హెచ్చరిక..

2024 సెప్టెంబర్‌ తనిఖీల్లో ఆర్‌బీఐ గుర్తించిన విలువ నిర్ధారణ, వేలం పారదర్శకత లోపాలు పునరావృతం కాకుండా సంస్థలు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా అత్యవసర నగదు, చిన్న వ్యాపారాలు, వ్యవసాయ అవసరాలకు బంగారు రుణాలపై ఆధారపడే సామాన్యులపై ఈ పరిణామం అదనపు ఆర్థిక భారాన్ని మోపుతోంది. ఆర్థిక వ్యవస్థలో ఆస్తుల నాణ్యత బలంగా ఉన్నప్పటికీ, పసిడి అస్థిరత నేపథ్యంలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు పూచీకత్తు విలువను నిరంతరం సమీక్షిస్తూ అప్రమత్తంగా వ్యవహరించడం అత్యవసరం.

 ఇదీ చదవండి: ధరలతో చిర్రెత్తిన ఉల్లి, వెల్లుల్లి!

gold and silver price1
1/6

gold and silver price2
2/6

gold and silver price3
3/6

gold and silver price4
4/6

gold and silver price5
5/6

gold and silver price6
6/6

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement