దేశంలో విమాన ప్రయాణానికి రోజురోజుకూ పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ప్రధాన విమానాశ్రయాల ప్రయాణికుల రద్దీ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి. 2026 అక్టోబర్ నెలలో ప్రయాణికుల రాకపోకల పరంగా ఢిల్లీ విమానాశ్రయం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. నెలలో మొత్తం 65,49,360 మంది ప్రయాణికులు ఢిల్లీ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించారు. దేశంలోని ఇతర ప్రధాన విమానాశ్రయాలతో పోలిస్తే ఢిల్లీ రద్దీ ఎక్కువగా ఉండటం విశేషం.
ముంబై విమానాశ్రయం 42,00,897 మంది ప్రయాణికులతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. బెంగళూరు విమానాశ్రయం 36,48,946 మంది ప్రయాణికులతో మూడో స్థానంలో నిలిచింది. ఈ మూడు విమానాశ్రయాలు దేశంలోని ప్రధాన విమానయాన కేంద్రాలుగా తమ స్థానాన్ని కొనసాగించాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాల మధ్య ప్రయాణికుల సంఖ్యలో స్పష్టమైన అంతరం కనిపిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ విమానాశ్రయం రద్దీ ముంబైతో పోలిస్తే 23 లక్షలకు పైగా ఎక్కువగా ఉంది. హైదరాబాద్ విమానాశ్రయం 22,87,296 మంది ప్రయాణికులతో నాలుగో స్థానంలో నిలిచింది.
అక్టోబర్ నెల గణాంకాల ప్రకారం..
ఢిల్లీ: 65,49,360
ముంబయి: 42,00,897
బెంగళూరు: 36,48,946
హైదరాబాద్: 22,87,021
కోల్‌కతా: 17,47,636
చెన్నై: 17,09,682
అహ్మదాబాద్: 10,11,737
పుణె: 9,32,173
కొచ్చిన్: 8,84,139
గువాహటి: 5,52,799
ఇదీ చదవండి: ధరలతో చిర్రెత్తిన ఉల్లి, వెల్లుల్లి!


