ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. ఇద్దరిని ఈడ్చుకెళ్లిన అధికారులు! | USSeattle airport as masked ICE agents drag away two fliers during boarding | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. ఇద్దరిని ఈడ్చుకెళ్లిన అధికారులు!

Nov 22 2026 10:52 AM | Updated on Nov 22 2026 10:52 AM

USSeattle airport as masked ICE agents drag away two fliers during boarding

వాషింగ్టన్‌: అమెరికాలోని సీటెల్‌-టాకోమా అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం గందరగోళం నెలకొంది. విమానం ఎక్కేందుకు సిద్ధమవుతున్న ప్రయాణికుల మధ్యకు ముసుగులు ధరించిన ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీ) అధికారులు వచ్చి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. లాస్‌ ఏంజెలెస్‌కు వెళ్లాల్సిన అలాస్కా ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌ 1306 బోర్డింగ్‌ సమయంలో ఈ ఘటన జరిగింది. ఉదయం 8.10 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఆలస్యమైంది.

వీసా గడువు దాటడంతో అరెస్ట్‌
మెక్సికోకు చెందిన రికార్డో లారొండో మెన్డోజా వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉంటున్నందున అతడిని అరెస్టు చేసినట్లు ఐసీ అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో మరో ప్రయాణికురాలు సోఫియా హెర్నాండెజ్‌ మెజియా అధికారులపై వేడి కాఫీ విసిరినట్లు తెలిపారు. ఆమె కూడా వీసా గడువు దాటినప్పటికీ అమెరికాలో ఉంటున్నట్లు గుర్తించామని, ఫెడరల్‌ అధికారిపై దాడి చేసిన అభియోగాలు ఎదుర్కొనే అవకాశం ఉందని వెల్లడించారు.
 

విమానాశ్రయంలో హైడ్రామా
అధికారులు ఓ వ్యక్తిని నేలపైకి లాగుతూ తీసుకెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తన కుమార్తెను తీసుకెళ్తున్నారని, ఆమెకు చెల్లుబాటయ్యే వర్క్‌ పర్మిట్‌ ఉందని ఓ మహిళ కేకలు వేయడం వీడియోలో కనిపించింది. వీసా గడువు దాటిన విదేశీయులపై విమానాశ్రయాల్లో ఐసీ తనిఖీలు ముమ్మరం చేసింది. ఈ చర్యపై ముందస్తు సమాచారం ఇవ్వలేదని అలాస్కా ఎయిర్‌లైన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రయాణికులు, సిబ్బందికి కలిగిన అసౌకర్యంపై విచారం తెలిపింది. ఘటనపై సమీక్షిస్తామని పోర్ట్‌ ఆఫ్‌ సీటెల్‌ వెల్లడించింది.

ఇదీ చదవండి: శబరిమల: ఇక రోజుకు 85 వేల మందికి దర్శన భాగ్యం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement