Nigeria: పడవ ప్రమాదం.. 24 మంది జలసమాధి | Nigeria boat Capsizes Carrying people to Funeral many dead Missing | Sakshi
Sakshi News home page

Nigeria: పడవ ప్రమాదం.. 24 మంది జలసమాధి

Nov 22 2026 8:02 AM | Updated on Nov 22 2026 8:11 AM

Nigeria boat Capsizes Carrying people to Funeral many dead Missing

బాయెల్సా: నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళుతున్న వారితో కూడిన పడవ శుక్రవారం బాయెల్సా రాష్ట్రంలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 24 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. గల్లంతైన వారి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పడవలో మొత్తం ఎంతమంది ప్రయాణిస్తున్నారు? ఇంకా ఎంతమంది ఆచూకీ తెలియాల్సి ఉందనే వివరాలు వెల్లడికాలేదు.

నైజీరియా జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ ప్రతినిధి మాంజో ఎజెకీ తెలిపిన వివరాల ప్రకారం.. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రయాణికులను పడవలో తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన 24 మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పడవలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీసు ప్రతినిధి మూసా మహమ్మద్ తెలిపారు. పడవను ఒడ్డుకు మళ్లించాలని ప్రయాణికులు నడిపేవారిని కోరినా ఆయన పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు.

అనంతరం పడవ నడిపే వ్యక్తి అక్కడి నుంచి పారిపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పడవ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంపై స్పందించిన బాయెల్సా రాష్ట్ర ప్రభుత్వం.. పడవ నిర్వాహకులు, ప్రయాణికులు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. పడవల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, అతివేగం, నిర్లక్ష్యం, లైఫ్‌జాకెట్లు లేకుండా ప్రయాణించడం వంటి వాటిని నిలిపివేయాలని రాష్ట్ర సమాచార కమిషనర్ ఎబియువోకు కోకు-ఒబియాయ్ విజ్ఞప్తి చేశారు. 

ఇదీ చదవండి: Rajasthan: ఘోర రోడ్డు ప్రమాదాలు.. 12 మంది మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement