జెలెన్‌స్కీ సొంత పట్టణంపై రష్యా క్షిపణి దాడులు | Russia Ballistic missile attack on Zelenskyy hometown in central Ukraine | Sakshi
Sakshi News home page

జెలెన్‌స్కీ సొంత పట్టణంపై రష్యా క్షిపణి దాడులు

Nov 22 2026 6:04 AM | Updated on Nov 22 2026 6:04 AM

Russia Ballistic missile attack on Zelenskyy hometown in central Ukraine

కీవ్‌: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత క్రివ్యీరిహ్‌ పట్టణంపై రష్యా బాలిస్టిక్‌ క్షిపణులతో దాడులకు పాల్పడింది. దాడుల్లో ఇద్దరు చనిపోగా, ఆరుగురు చిన్నారులు సహా 60 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఏడేళ్ల బాలుడు, 20 ఏళ్ల యువతి ఉన్నారని చెప్పారు. ‘దాడుల్లో బహుల అంతస్తుల 25 అపార్టుమెంట్‌ భవనాలతో పాటు ఆస్పత్రి, స్కూళ్లు, పారిశ్రామిక కేంద్రం, వ్యాపార సంస్థలు, వాహనాలు ధ్వంసమయ్యాయి.

 నాలుగు చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. మొదటగా రెండు బాలిస్టిక్‌ క్షిపణులు పడ్డాయి. అత్యవసర, సహాయక బృందాలు, వైద్యు లు అక్కడికి చేరుకోగానే మరో మూడు రాకెట్లు దూసుకువచ్చాయి’అని అధికా రులు వివరించారు. ఇలా ఉండగా, ఫిన్లాండ్‌ సమీపంలో కలినిన్‌గ్రాడ్‌ వైపు వస్తున్న రష్యా సరుకు నౌకపై డ్రోన్‌ దాడి జరగ్గా, మంటలు చెలరేగినట్లు రష్యా అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement